చంద్రబాబు గత పరిపాలనలో పేదలకు సెంటు భూమి ఇచ్చిన చరిత్ర లేదని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు.. గత వైసీపీ హయంలో 30.6 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారన్నారు.. జగన్ పేదల ఇళ్ల స్థలాల కోసం 15 వేల కోట్లతో భూములు కొనుగోలు చేశారన్నారు. దేశంలోని ఏ రాజకీయ పార్టీ కూడా పేదల స్థలాల కోసం ఇంత ఖర్చు చేయలేదన్నారు..
ఇరిగేషన్‌పై మాట్లాడే అర్హత వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు లేదని మంత్రి రామానాయుడు అన్నారు. అమరావతిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి జగన్ కూడా కారణం అన్నారు.
టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణతో నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు వైసీపీ నేత అబ్దుల్ ఫయాజ్ కుమారుడి వివాహంలో వీరంగం సృష్టించారు. వివాహ వేడుకలను డ్రోన్ కెమెరాతో షూట్ చేస్తున్న ఆపరేటర్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అబ్దుల్ ఫైజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పీఎస్ ముందు మాజీ ఎమ్మెల్యే కాటసాని ధర్నాకు సిద్ధమయ్యారు. శివనంది నగర్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నివాసం…
వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు మంది మార్బలంతో నియోజకవర్గాలలో తిరిగేది కాదు... అధికారం కోల్పోయిన 8 నెలల తర్వాత రాయచోటికి వచ్చాడని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడదల రజని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేద వాడికి కార్పొరేట్ వైద్యం అందాలని ఆశయంతో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకంను ప్రారంభించారని తెలిపారు.
హైందవ శంఖారావం సభలో పెద్ద ఎత్తున హిందువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. అయితే.. పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలను మాజీమంత్రి కొట్టు సత్యనారాయణ ఖండించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వ్యక్తులు ఎవరు రాజకీయ కోణంలో మాట్లాడలేదని.. కేవలం పురంధేశ్వరి మాత్రమే చంద్రబాబు ప్రాపకం కోసం తమ పార్టీపై బురద చల్లాలని చూశారని ఆరోపించారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి విజయసాయిరెడ్డి వచ్చారు. కాకినాడ పోర్టు సెజ్‌కు సంబంధించిన కేసులో ఈడీ ఎదుట ఆయన విచారణకు ఆయన హాజరయ్యారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలపై వైసీపీ ఎంపీని ఈడీ అధికారులు ఎంత సేపు విచారణ చేస్తారో చూడాలి. వైసీపీ హయాంలో కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ (కేఎస్పీఎల్), కాకినాడ సెజ్ (కేసెజ్)ల్లోని రూ.3,600 కోట్ల విలువైన షేర్లను కేవీ రావు (కర్నాటి వెంకటేశ్వరరావు)…
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. అనిల్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా? అని ప్రశ్నించింది. పిటిషనర్‌కు పూర్వ నేర చరిత్ర ఉందని, అనుచిత పోస్టుల వ్యవహారంలో నమోదైన 2 కేసుల్లో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలైందని ప్రాసిక్యూషన్ చెప్పారు. ప్రాసిక్యూషన్ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదని కోర్టు తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో బోరుగడ్డ…
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధ విచారణ పూర్తయింది. మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధను 2 గంటలపాటు పోలీసులు ప్రశ్నించారు. విచారణలో ఆమె సమాధానాలతో పోలీసులు సంతృప్తి చెందలేదు. మరోసారి నోటీసులు ఇచ్చి విచారించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కాగా.. విచారణలో పోలీసులు 45 ప్రశ్నలు అడిగారు. గోడౌన్ నిర్వహణ అంతా మేనేజర్ మానస తేజ చూస్తారని ఆమె చెప్పింది
రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రేషన్ బియ్యం కేసు విచారణలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్‌పేట పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీసులలో పేర్కొన్నారు. ఈ కేసులో జయసుధకు ఇప్పటికే కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసు విచారణకు సహకరించాలని కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని నివాసానికి పోలీసులు…