వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీలో పలు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. చోడవరం నియోజకవర్గ సమన్వయకర్తగా గుడివాడ అమర్నాథ్, మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్తగా బూడి ముత్యాల నాయుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా తిప్పల దేవన్ రెడ్డిని నియమించారు. పి.గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్తగా గన్నవరపు శ్రీనివాస రావు, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా కరణం ధర్మశ్రీ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికూటి అశోక్ బాబుకు అవకాశం లభించింది.
READ MORE: Amit Shah AP Tour : సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా..
ఇదిలా ఉండగా.. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఓటమి అనంతరం గతంలో తాడేపల్లిలో జరిగిన వైసీపీ నేతల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమావేశం అనంతరం జగన్ ఈ ప్రకటన చేశారు. తాజాగా నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించడం గమనార్హం.
READ MORE: Vayve Eva Solar Car: సోలార్ పవర్‌తో నడిచే కారు వచ్చేసింది.. ధర రూ. 3 లక్షలు మాత్రమే!