రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. అనిల్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా? అని ప్రశ్నించింది. పిటిషనర్‌కు పూర్వ నేర చరిత్ర ఉందని, అనుచిత పోస్టుల వ్యవహారంలో నమోదైన 2 కేసుల్లో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలైందని ప్రాసిక్యూషన్ చెప్పారు. ప్రాసిక్యూషన్ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదని కోర్టు తేల్చి చెప్పింది.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో బోరుగడ్డ అనిల్‌పై అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెయిల్ కోసం అనిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా.. నేడు హైకోర్టు కొట్టి వేసింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అనిల్ అరాచకానికి హద్దే లేదు. ప్రతిపక్షాలు, ప్రతిపక్షనేతలపై సామాజిక మాధ్యమాలు, టీవీ డిబేట్‌లలో ఇష్టానుసారం దూషణలు చేశాడు. కొన్నిసార్లు చంపేస్తానంటూ బెదిరింపులకు కూడా దిగాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ప్రతిపక్ష మహిళలను అసభ్యకరంగా దూషించేవాడు. అసభ్యకర పోస్టులపై అనిల్‌పై కేసు నమోదైంది.