వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని.. ఆధారాలు చేరిపి వేయడం, సాక్షులను బెదిరించడం వంటివి చేయరాదని ఆదేశించింది. మిగతా షరతులన్నీ దర్యాప్తు అధికారి నిర్ణయిస్తారని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం గౌతమ్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపింది. గౌతమ్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు.…
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నాం అని వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం పేర్కొన్నారు. ఏబీవీ అహంకారంతో తలతిక్కగా ప్రవర్తిస్తున్నారని, కుల అహంకారంతో ప్రవర్తిస్తే మిగతా కులాలు తిరగబడతాయని తెలుసుకోవాలన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ రెడ్డిలు ఏనాడు కులం కోసం పని చెయ్యలేదని.. కుల, మతాలకు అతీతంగా పనిచేశారు కాబట్టే 40 శాతం ఓట్లు సాధించారన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలపై…
మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులపై కాకాణి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కోళ్లదిన్నెకు చెందిన టీడీపీ నేత వంటేరు ప్రసన్న కుమార్.. కావలి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కాకాణిపై కేసు నమోదు చేశారు. ఆయనపై 224, 351/2, 352, 353/2 సెక్షన్ల కింద…
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధులు సాధించడం కూటమి ప్రభుత్వ విజయం అని మంత్రి కోలుసు పార్థ సారథి అన్నారు. ఆంధ్రుల పోరాటంతో ఏర్పడిన విశాఖ ఉక్కు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు. ప్లాంట్‌ను కేంద్రం వదులుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపించాలని మంత్రి నారా లోకేష్ గతంలోనే నిర్ణయించారని మంత్రి కోలుసు గుర్తుచేశారు. గతంలో 21 ఎంపీలు ఉన్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల గాలికి వదిలేసారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయకత్వం పట్ల కేంద్ర ప్రభుత్వానికి…
ఏపీ మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం మాత్రమే కాదు.. సీఎం అవ్వాలని కూడా వ్యక్తిగతంగా తాను కోరుకుంటున్నా అని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి పదవి ఇస్తే తాను స్వాగతిస్తానన్నారు. ఎన్డీఏ కూటమిలో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో పెద్దలు నిర్ణయిస్తారని, వర్మ లేదా ఇంకెవరైనా చెప్పినా వారి వ్యక్తిగత అభిప్రాయమే అని పేర్కొన్నారు. లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటేనే దానికి ప్రాధాన్యం…
వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డిపై హైడ్రాలో ఫిర్యాదు నమోదైంది. అమీన్ పూర్లో 193 సర్వే నంబర్లోని తమ ల్యాండ్ కబ్జాకు గురైందని ఓ మహిళ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. పాన్యం మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి, చిస్ట్లా రమేష్ కలిసి తమ ల్యాండ్ కబ్జా చేశారని తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాంభూపాల్ రెడ్డి దౌర్జన్యాలు చేశారని, అందుకు సంభందించిన అన్ని ఆధారాలు హైడ్రాకు సమర్పించానని సదరు మహిళ చెప్పారు. తన ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ స్పందించి…
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్‌పై వైసీపీకి చాలా అనుమానాలు ఉన్నాయని సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. స్టీల్ ప్లాంట్ ముసుగులో కూటమి పార్టీలు గుద్దులాడుతున్నాయని ఆరోపించారు.
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు అంటూ వైసీపీ చేసే విషప్రచారాన్ని ప్రజలెవ్వరూ నమ్మొద్దని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ వ్యవస్థపై జగన్మోహన్ రెడ్డి కక్ష పెట్టుకున్నందుకే రోజూ అసత్యాల బురద చల్లుతున్నాడని ఆరోపించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలో ఆయనకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు.. గతంలో అమిత్ షా తిరుపతి పర్యటన సమయంలో చంద్రబాబు బ్యాచ్ రాళ్ల వర్షం కురిపించారని అన్నారు. నచ్చితే కాళ్ళు.. నచ్చకుంటే జుట్టు పట్టుకునే టైప్ రాజకీయ నేత చంద్రబాబని దుయ్యబట్టారు.