వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు మంది మార్బలంతో నియోజకవర్గాలలో తిరిగేది కాదు… అధికారం కోల్పోయిన 8 నెలల తర్వాత రాయచోటికి వచ్చాడని ఆరోపించారు. పార్టీ అధికారంలో లేదని చెప్పి అధికార పార్టీ పై విచిత్రమైన ప్రేలాపాలను చేయడం చాలా తప్పు అని దుయ్యబట్టారు. ఆ రోజు వైసీపీ వారు చేసిన తప్పులకు నేడు 11 సీట్లు వాళ్లకు వస్తే.. 160 సీట్లు పైగా కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్ని అరచి గగ్గోలు పెట్టిన కూడా ఎలక్షన్ వచ్చేది నాలుగున్నర సంవత్సరం తరువాతేనని పేర్కొన్నారు. వైసీపీ వాళ్లు నీతి, నిజాయితీగా ప్రతిపక్ష పాత్ర పోషించాలి.. ప్రజా క్షేత్రంలో పాలకపక్షం ఏదైనా తప్పు చేస్తే వేలెత్తి చూపించే అర్హత, బాధ్యత వైసీపీ వాళ్లకు ఉందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
Anshu Ambani : 23 ఏళ్ళ తర్వాత హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తున్న నాగ్ హీరోయిన్
అంతకుముందు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ… టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్నమయ్య జిల్లాలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని ఆరోపించారు. జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఎన్నో రకాల అభివృద్ధి పనులు ఆగిపోయాయి.. అన్నమయ్య ప్రాజెక్ట్ పునర్మాణ పనులను నిలిపివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. పనులు చేసి ప్రాజెక్టును పూర్తి చేయకుండా టెండర్ రద్దు చేయాలని అనుకోవడం దారుణమని అన్నారు. మదనపల్లిలో మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి.. అలాగే, చాలా గ్రామాలకు ఇప్పటివరకు రోడ్లు లేవు, రోడ్లు వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాల్సిన అవసరం ఉందని మిధున్ రెడ్డి మాట్లాడారు.
AI Robot Girlfriend: మార్కెట్‌లోకి ఏఐ గర్ల్‌ఫ్రెండ్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!