Kakani Govardhan Reddy: సంపద సృష్టించడం అంటే.. ఉన్న ఆస్తులను పగలగొట్టడమా?
- బాలకృష్ణ రెడ్డి ఇంటిని పరిశీలించిన కాకాని గోవర్ధన్ రెడ్డి
- మంత్రి నారాయణకు కౌంటర్ వేసిన కాకాని
- అత్యుత్సాహం చూపిస్తున్న అధికారులను మరచిపోము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసకర పరిపాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని, దానికి పరాకాష్టగా వైసీపీ నేత బాలకృష్ణా రెడ్డి ఇంటిని కూలగొట్టడమే అని మండిపడ్డారు. సంపద సృష్టించడం అంటే.. ఉన్న ఆస్తులను పగలగొట్టడమా? అని ప్రశ్నించారు. పరిపాలన అంటే స్కూళ్లు, కాలేజీలను నిర్వహించడం కాదని మంత్రి నారాయణ తెలుసుకోవాలని కాకాని పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్‌లో నగరపాలక సంస్థ అధికారులు కూల్చిన వైసీపీ నేత బాలకృష్ణ రెడ్డి ఇంటిని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైసీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి చంద్ర శేఖర్ రెడ్డిలు పరిశీలించారు.
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసకర పరిపాలన సాగిస్తున్నారు. వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. దానికి పరాకాష్టగా వైసీపీ నేత బాలకృష్ణారెడ్డి ఇంటిని కూలగొట్టారు. 40 సంవత్సరాలుగా ఇదే ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఇటీవలే ఇంటిని ఆధునికీకరించారు. సంపద సృష్టించడం అంటే ఉన్న ఆస్తులను పగలగొట్టడమా?. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పరిపాలన అంటే స్కూళ్లు, కాలేజీలను నిర్వహించడం కాదని నారాయణ తెలుసుకోవాలి. నారాయణ మంత్రి అయిన తర్వాత రకరకాల జీవోలు తీసుకువచ్చారు. వైసీపీ వాళ్ల ఇళ్లను కూల్చేస్తామని, టీడీపీ వారి జోలికిపోమని కూడా జీవో తీసుకురావాలి’ అని ఎద్దేవా చేశారు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
Also Read: AB De Villiers Re-Entry: అభిమానులకు శుభవార్త.. దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్!
‘ప్రజల ఓట్లు వేసి గెలిపించింది ఇందు కోసమా?. ఇంటి అంశం న్యాయస్థానంలో ఉన్నా కూలగొట్టారు. కొందరు మున్సిపల్ అధికారులు ఎగిరిపడుతున్నారు. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత అత్యుత్సాహం చూపిస్తున్న అధికారులను మరచిపోము. ఇలాంటి అధికారుల అంతు చూస్తాం. నారాయణ మెడికల్ కళాశాల కింద కూడా చాలా కాలువలు పోతున్నాయి. మెడికల్ కళాశాల కూడా కూలిపోతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నందున మీ కళాశాల జోలికి రాలేదు, మిమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పటికైనా ధోరణి మార్చుకోవాలి’ అని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!