ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు, ప్రభుత్వ అజెండాపై అఖిలపక్ష నేతలకు కేంద్రం వివరించింది. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని, కీలక బిల్లుల ఆమోదానికి మద్దతు తెలపాలని అఖిలపక్ష నేతలను ప్రభుత్వం కోరింది. అఖిలపక్ష సమావేశానికి టీడీపీ తరపున బీద మస్తాన్ రావు, వైసీపీ తరపున మిథున్ రెడ్డి, జనసేన తరపున బాలశౌరి హాజరయ్యారు.
2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని పార్టీ ముఖ్య నాయకులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ పని తీరును నిరంతరం పర్యవేక్షించుకుంటూ, మెరుగుపరుచుకుంటూ పనిచేయాలని సూచించారు. పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని ప్రోత్సహించాలని, పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూసే బాధ్యత ఎమ్మెల్యేలదే అని సీఎం పేర్కొన్నారు. త్వరలో 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులకు నియామకాలు జరుగుతాయని చంద్రబాబు తెలిపారు. పార్టీ ముఖ్య నాయకులు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్లతో…
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసకర పరిపాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని, దానికి పరాకాష్టగా వైసీపీ నేత బాలకృష్ణా రెడ్డి ఇంటిని కూలగొట్టడమే అని మండిపడ్డారు. సంపద సృష్టించడం అంటే.. ఉన్న ఆస్తులను పగలగొట్టడమా? అని ప్రశ్నించారు. పరిపాలన అంటే స్కూళ్లు, కాలేజీలను నిర్వహించడం కాదని మంత్రి నారాయణ తెలుసుకోవాలని కాకాని పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్లో నగరపాలక సంస్థ అధికారులు కూల్చిన…
వైసీపీ పార్టీలో ఉండలేకే విజయసాయి రెడ్డి బయటకు వచ్చారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. విజయసాయి రెడ్డి పార్టీ నుంచి బయటికి వచ్చినందుకు తాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానన్నారు. ఏ2 విజయసాయి రెడ్డి, ఏ1 జగన్ రెడ్డి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ఇష్టం వచ్చినట్లు అప్పులు, తప్పులు చేశారని మండిపడ్డారు. వైసీపీ పార్టీ ఓ డైనోసార్ అని, జగన్ సార్ బేకార్ అని విమర్శించారు. రాజకీయాల్లోకి నేరగాళ్లను రానీయవద్దని, ప్రజలు…
మాజీ పర్యటక శాఖ మంత్రి రోజాపై రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఫైర్ అయ్యారు. దావోస్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లలేదని రోజా చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాజమండ్రిలో మంత్రి దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ.. క్యాబినెట్లో అందరినీ దావోస్ తీసుకుని వెళ్లారని అన్నారు. రోజా అవగాహన రాహిత్యంతో చేస్తున్న వ్యాఖ్యలని కొట్టిపారేశారు. గత ప్రభుత్వంలో మంత్రి రోజా పర్యాటక శాఖను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. విశాఖపట్నం ఋషికొండ వద్ద పర్యాటక ప్రాంతంలో ప్యాలెస్…
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఏదో ఒత్తిడితో రాజీనామా చేయించారని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. రాజ్యసభ స్థానానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయటం బాధాకరం అని పేర్కొన్నారు. వైసీపీ పార్టీ కష్ట కాలంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అండగా నిలబడ్డారన్నారు. రాజ్యసభ పోయినా పర్లేదు, పార్టీకి సేవ చేయమని తాను కోరుతున్నానన్నారు. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు విజయసాయి రెడ్డి శనివారం తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ట్వీట్…
పార్టీ మారేవాళ్లను సముదాయిస్తాం కానీ.. కాళ్లు పట్టుకోలేమని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాల నుంచి వచ్చిన తరువాత పార్టీలో తాజా పరిణామాలపై చర్చిస్తామని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేక టీడీపీ రాజ్యసభ సభ్యులు ఏకంగా పార్టీలు మారిపోయారని విమర్శించారు. తనపై హోంమంత్రి చేసే వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం లేదని, హోంమంత్రి రీల్స్ చూసుకుని కాలక్షేపం చేసేస్తే మంచిదని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. విశాఖలో…
విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందని ఎక్స్ లో పేర్కొన్నారు.
విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చేసిన ప్రకటనపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వస్తోందని తెలిపారు.
వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని.. ఆధారాలు చేరిపి వేయడం, సాక్షులను బెదిరించడం వంటివి చేయరాదని ఆదేశించింది. మిగతా షరతులన్నీ దర్యాప్తు అధికారి నిర్ణయిస్తారని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం గౌతమ్ రెడ్డి పిటిషన్పై విచారణ జరిపింది. గౌతమ్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు.…