YS Jagan: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లాల అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు (ఏప్రిల్ 29) సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది.
వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసుల విచారణ మొదలయ్యింది. పోలీసుల అదుపులో ఉన్న ఐ టీడీపీ నేత చేబ్రోలు కిరణ్ పై దాడికి ప్రయత్నించిన ఘటనలో గోరంట్ల మాధవ్ పై కేసు నమోదయ్యింది. ఈ కేసు విచారణలో భాగంగా ఐదు రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ నగరంపాలెం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజులు పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న గోరంట్ల మాధవ్ ను…
రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను గుంటూరు పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. కోర్టు ఇచ్చిన కస్టడీ ఉత్తర్వులను సెంట్రల్ జైలు అధికారులకు అందించి.. కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజుల కస్టడీ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ప్రత్యేక వాహనంలో గోరంట్ల మాధవ్‌ను తీసుకుని ఎస్కార్ట్ సిబ్బంది గుంటూరుకు బయలుదేరి వెళ్లారు. Also Read: Pawan Kalyan: ఉగ్రదాడి ఘటన తీవ్రంగా కలచివేస్తోంది: పవన్ కల్యాణ్ టీడీపీ నేత…
Home Minister Anitha: వైసీపీ పార్టీ నేతలు చేస్తున్న తప్పుడు ఆరోపణలపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తప్పు చేసిన వారికి శిక్షపడాలనే నినాదంతో కూటమి ప్రభుత్వం వెళ్తోందన్నారు.
నేడు వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు పీఏసీ తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పీఏసీ సభ్యులు హాజరుకానున్నారు. పీఏసీ సమావేశంలో పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. 33 మందిని పీఏసీ…
Gorantla Madhav : వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నెల 23, 24వ తేదీల్లో మాధవ్ ను విచారించేందుకు గుంటూరు నగర పోలీసులకు పర్మిషన్ ఇస్తూ కస్టడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి పోలీసులు ఐదు రోజుల కస్టడీ కోరారు. కానీ కోర్టు రెండు రోజులకు పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు గోరంట్ల మాధవ్. 23న మాధవ్ ను నగరం పాలెం…
YS Jagan: రేపు (ఏప్రిల్ 22వ తేదీన) తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం జరగనుంది.
కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా తనపై మద్యం కేసు పెట్టారని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా శనివారం సిట్ అధికారుల ఎదుట మిథున్‌రెడ్డి హాజరయ్యారు. విచారణ ముగిసిన తర్వాత విజయవాడలో మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తాను చేతులెత్తి జోడిస్తున్నా అని, టీటీడీ గోశాలను ఎవరూ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. హైడ్రామా సృష్టించి భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని, టీటీడీపై రాద్ధాంతం మానుకోండన్నారు. రాజకీయ రాద్ధాంతం జరిగితే టీటీడీ ప్రతిష్ట దిగజారే అవకాశం ఉందన్నారు. ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని, న్యాయవ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోందన్నారు. తిరుపతిలో టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై వైసీపీ, కూటమి నేతల మధ్య రాజకీయ దుమారం రేగింది. ఈ…