YS Jagan: శ్రీ సత్యసాయి జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు.
మద్యం స్కాం కేసులో సీఐడీ నోటీసులను సవాలు చేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. సీఐడీ నోటీసులను సవాలు చేస్తూ కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. తొందర పాటు చర్యలు తీసుకోకుండా సీఐడీకి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి కూడా హైకోర్టు నిరాకరించింది. 164 స్టేట్మెంట్ ఇవ్వటానికి వెళ్తే అరెస్టు చేసే అవకాశం ఉందని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు. విచారణకు కొంత సమయం ఇవ్వాలని కోరటంతో ఆ దిశగా నోటీసులు…
వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌ను అనంతపురం మూడో పట్టణ పీఎస్‌కు తరలించారు. ఇవాళ ట్రయల్ కోర్టు ముందు అనిల్‌ను పోలీసులు హాజరుపరచనున్నారు. రాజమహేంద్రవరం కారాగారంలో బోరుగడ్డ అనిల్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కోర్టు అనుమతితో రాజమహేంద్రవరం నుంచి అనంతపురంకు పోలీసులు తీసుకోచ్చారు. 2018లో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో Cr No 156/2018 u/s 419 186 506 ఐపీసీ కింద బోరుగడ్డ అనిల్‌పై కేసు నమోదు అయింది. ఐఏఎస్ అధికారి నంటూ అప్పటి…
YS Jagan: శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి మండలం పాపిరెడ్డి పల్లిలో గత రెండు రోజుల క్రితం హత్యకు గురైన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్ది పరామర్శించారు.
వైసీపీ అధినేత జగన్‌కు తత్వం పూర్తిగా బోధపడిందా? పార్టీ హైకమాండ్‌కు రియాలిటీ ఏంటో తెలిసి వచ్చిందా? నిన్నటి ఎంపీపీ ఎన్నికలతో బొమ్మ క్లియరైందా? మన వాళ్ళు ఎవరు? కాని వాళ్ళు ఎవరన్న సంగతి జగన్‌కు తెలిసివచ్చిందా? ఇంతకీ ఏం జరిగింది? ఏ విషయంలో పిక్చర్ క్లియరైంది? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో గట్టి పట్టు ఉంది.చిన్న చితకా పార్టీ కార్యక్రమాలైతే… ముఖ్య నేతలతో సంబంధం లేకుండా స్థానిక నాయకులు చేసుకుపోతుంటారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు…
టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవాలను పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. ఈ సందర్భంగా మాజీమంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబటి మాట్లాడుతూ.. “నిజమైన తెలుదేశం కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ తెలుగు ప్రజలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తేవటానికి పుట్టిన పార్టీ అని చెప్పారు.. ఆయన చెప్పిన చరిత్ర మామూలు చరిత్ర కాదు.. టీడీపీ ఆవిర్భవించిన రోజు చంద్రబాబు కాంగ్రెస్ జెండా మోస్తున్నారు.. ఇందిరా గాంధీ ఆజ్ఞాపిస్తే ఆయన మామ చంద్రబాబు…
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో స్కీములు లేవని.. అన్నీ స్కాములు మాత్రమే ఉన్నాయని అన్నారు. అమరావతి నుంచి హంద్రినీవా దాకా అంతా అవినీతే తాండవిస్తోందని తెలిపారు. కాంట్రాక్టు సంస్థలు రింగ్ అవుతున్నాయి, దీనివల్ల సమయం, ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్నారు. ప్రశ్నిస్తామని చెప్పిన వాళ్ళు ఎక్కడున్నారో తెలియడం లేదంటు మండిపడ్డారు. దేశంలోనే అత్యుత్తమ కాంట్రాక్టు విధానాన్ని జగన్ తీసుకొచ్చారు. జ్యూడిషియల్ ప్రివ్యూతో పాటు రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఈరోజు పర్యటించనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలోని లింగాల మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి పంటలను జగన్ పరిశీలించనున్నారు. అనంతరం అరటి రైతులను పరామర్శించనున్నారు. శనివారం తీవ్ర ఈదురుగాలులతో లింగాల మండలంలో వేల ఎకరాలలో పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ సోమవారం ఉదయం 8.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి లింగాల మండలంకు చేరుకుంటారు. నష్టపోయిన…
మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు నమోదు అయింది. 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగాలు ఉన్నాయి. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఆమెపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో విడదల రజనీపై కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామాపై మాజీ మంత్రి విడదల రజని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీగా ప్రతిపక్షంగా ఉన్న సమయంలో పార్టీకి అండగా ఉండాలని, ఇలా రాజీనామాపై చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో చేస్తున్న అరాచకాలు శాసనమండలిలో ప్రశ్నించి ఉంటే.. ఆయనకు మరింత గౌరవం పెరిగి ఉండేదన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశానుసారం గత ఎన్నికల్లో తాను గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశానని తెలిపారు. ఇంతవరకు గుంటూరు వెస్టులో…