2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టు.. వైసీపీ పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదని, లక్ష 50 వేల కోట్ల రూపాయలు అప్పు తప్ప అని విమర్శించారు. ప్రధాని మోడీ అమరావతికి ఎందుకు వచ్చారు, అమరావతిలో ఇప్పటివరకు ఏమి చేశారు, ఏమి చేస్తారో ముఖ్యమంత్రి చెంద్రబాబు సమాధానం…
వైసీపీ హయాంలో జరిగిన మైనింగ్ దోపిడీలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పాత్ర గురించి అందరికీ తెలుసు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర విమర్శించారు. అక్రమాలు చేయనప్పుడు ఎందుకు పరారయ్యారని, బయటకు వచ్చి తాను నిజాయితీ పరుడునని చెప్పుకోవచ్చు కదా? అని అన్నారు. కేసులకు భయపడే కాకాణి పరారయ్యారని ఎద్దేవా చేశారు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా త్వరలో అరెస్ట్ కాబోతున్నాడని ఎమ్మెల్సీ బీదా…
Thopudurthi Prakash Reddy: శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి మండలం పాపిరెడ్డి గ్రామ సమీపంలో హెలిప్యాడ్ దగ్గర జరిగిన ఘటనలో కీలక వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే. ఆరు సార్లు పోటీ చేసి మూడు విడతలు గెలిచారాయన. కానీ... ఈసారి తాను గెలిచి, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆయన వైఖరి కాస్త మారినట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాల్లో ఎక్కడా పార్టీ నాయకులు ఇన్వాల్వ్ కావద్దని చెబుతున్నారట ఎమ్మెల్యే.
గుంటూరు మేయర్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది. కానీ... తమకు పూర్తి మెజార్టీ ఉన్న చోట ఆ పరిస్థతి ఎందుకు వచ్చిందన్న అంతర్మధనం జరుగుతోందట వైసీపీలో. తమకు వెన్నుపోటు పొడిచిన ఆ కట్టప్ప ఎవరంటూ లోకల్ లీడర్స్ ఆరా తీస్తున్నారట. జీఎంసీలో మొత్తం 57డివిజన్లు ఉంటే.... అందులో వైసీపీ 46, టీడీపీ 9, జనసేన 2 స్థానాల్లో గెలిచాయి.
పార్టీ రీఛార్జ్ ప్రోగ్రామ్లో భాగంగా తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్లో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. కింది స్థాయి నుంచి కీలకమైన పొలిటికల్ అడ్వైజరీ కమిటీలు, జిల్లా అధ్యక్షులతో మీటింగ్లు నడుస్తున్నాయి. అలాగే పెండింగ్లో ఉన్న పార్టీ పదవుల్ని సైతం భర్తీ చేస్తున్నారు. ఇలా... అధికారంలో ఉన్నప్పటికంటే కూడా ఎక్కువగా పార్టీ యాక్టివిటీ నడుస్తుండటంతో.. ఏదో.. ఉంది, ఏం జరుగుతోందన్న అమమానాలు మొదలయ్యాయట రాజకీయ వర్గాల్లో.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)ని గ్రామస్థాయి నుంచి పటిష్ట పరచాలని నిర్ణయం తీసుకున్న పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్టీలో నూతన నియామకాలు జరిగాయి. పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను జగన్ చేపట్టారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులను నియమిస్తూ వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా మాజీ మంత్రి సాకే శైలజానాథ్ను…
వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి బెయిల్పై విడుదల అయ్యారు. గుంటూరు కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పదివేల పూచీకత్తు, ఇద్దరు జామీన్ల హామీతో బెయిల్ మంజూరైంది. రెండు నెలల పాటు ప్రతి శనివారం గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలన్న కోర్టు ఆదేశించింది. గోరంట్ల మాధవ్ ఈ నెల 11 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్నారు. ఇక మాధవ్ సహా…
Gorantla Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు గుంటూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 11వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్ లో అతడు రిమాండ్ లో ఉన్నాడు. ఇక, బెయిల్ పత్రాలు సమర్పించిన అనంతరం ఇవాళ రాజమండ్రి జైలు నుంచి గోరంట్ల విడుదలయ్యే అవకాశం ఉంది.