Off The Record: గుంటూరులో వైసీపీకి వెన్నుపోటు పొడిచిందెవరు… సరిపడా బలం ఉండి కూడా మేయర్ తన పదవికి ఎందుకు రాజీనామా చేశారు? చివరికి పీఠాన్ని ఎందుకు వదిలేసుకోవాల్సి వచ్చింది? అసలు పార్టీలో ఎవరికీ చెప్పకుండా కావటి మనోహర్ రాజీనామా చేయడానికి కారణం ఏంటి? వైసీపీ పోస్టుమార్టంలో ఏం తేలింది?
Read Also: TG RTC JAC: ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమన్న తెలంగాణ ఆర్టీసీ జేఏసీ..
గుంటూరు మేయర్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది. కానీ… తమకు పూర్తి మెజార్టీ ఉన్న చోట ఆ పరిస్థతి ఎందుకు వచ్చిందన్న అంతర్మధనం జరుగుతోందట వైసీపీలో. తమకు వెన్నుపోటు పొడిచిన ఆ కట్టప్ప ఎవరంటూ లోకల్ లీడర్స్ ఆరా తీస్తున్నారట. జీఎంసీలో మొత్తం 57డివిజన్లు ఉంటే…. అందులో వైసీపీ 46, టీడీపీ 9, జనసేన 2 స్థానాల్లో గెలిచాయి. మేయర్‌గా కావటి మనోహర్, డిప్యూటీ మేయర్లుగా డైమండ్ బాబు, షేక్ సజీల ఎన్నికయ్యారు. మూడేళ్లు అంతా బాగానే ఉంది. కానీ… ఎన్నికలకు ముందు డిప్యూటీ మేయర్ సజీల, మరో నలుగురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్టాండింగ్ కమిటీ ఎన్నికల సమయంలో మరో 11మంది కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరిపోయారు. అప్పుడు మరో ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ చేసినట్టు చెప్పుకున్నారు. ఇక ఆ తర్వాత ఏమైందోగానీ… సడన్‌గా మేయర్ కావటి మనోహర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Read Also: Off The Record: వైసీపీలో అత్యంత కీలక మార్పులు.. వైఎస్ జగన్ క్లియర్ కట్ ఇండికేషన్స్
అయితే, మున్సిపల్ కమిషనర్ వైఖరికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు చెప్పారాయన. వైసీపీ అధిష్టానానికి అదో షాక్. కమిషనర్‌తో పొసగకుంటే మేయర్ రాజీనామా చేస్తారా అంటూ నోరెళ్ళబెట్టాల్సి వచ్చిందట వైసీపీ పెద్దలు. మనోహర్ రాజీనామా ప్రకటించిన వెంటనే జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఫోన్ చేసినా…ఆయన లిప్ట్ చెయ్యలేదట. మరికొంతమంది పార్టీ నేతలు ఫోన్ చేసినా స్పందన లేదని చెప్పుకుంటున్నారు. అసలు మనోహర్ ఎవరికీ చెప్పకుండా అంత సడన్‌గా ఎలా నిర్ణయం తీసుకున్నారన్నది అంతుబట్టలేదట వైసీపీ పెద్దలకు. దీంతో కొంతమంది పార్టీపెద్దలు అసలు ఏం జరిగిందనేదానిపై ఆరా తీశారట. స్థానికంగా ఉన్న నాయకులతో కూడా మాట్లాడి సమాచారం సేకరించినట్టు తెలిసింది. వాస్తవానికి కూటమి నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా గుంటూరు వైసీపీ చేజారే పరిస్థితి లేదు. మేయర్ మీద అవిశ్వాసం పెట్టినా వీగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సిటీలో 57మంది కార్పరేటర్లు ఉన్నారు.
Read Also: Top Headlines @9PM : టాప్ న్యూస్!
ఇక, వైసీపీ బలం 46 కాగా… ఒకరు చనిపోయారు. ఎన్నికలకు ముందు ఐదుగురు, ఎన్నికల తర్వా త 12 మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమిలో చేరారు. మేయర్ మీద కూటమి అవిశ్వాసం పెట్టాలంటే టూ థర్డ్ మెజారిటీ ఉండాలి. అవిశ్వాసం పెడితే 42 మంది మేయర్‌కు వ్యతిరేకంగా ఓటెయ్యాలి. కానీ కూటమికి అంత బలం లేదు. అవిశ్వాసం పెట్టినా వైసీపీకి 27మంది కార్పొరేటర్ల బలం ఉంది. అనుకోని పరిస్థితుల్లో ఒకరిద్దరు ప్లేటు ఫిరాయించినా ఇబ్బంది లేదు. అయినాసరే… ఈ లెక్కలన్నీ తెలిసి కూడా కావటి మనోహర్ రాజీనామా చెయ్యడం కూటమికి కలిసి వచ్చిందని అంటున్నారు. బలం ఉన్నాసరే… ఆయన ఎందుకు రాజీనామా చేశారు… అవిశ్వాసం పెట్టినా సరే… వైసీపీకి అనుకూలంగా ఫలితం వచ్చే అవకాశం ఉన్నా ఎందుకిలా జరిగిందని పోస్టుమార్టం చేస్తున్నారట వైసీపీ లీడర్స్. అయితే, కేసులకు భయపడి ఆయన అలా చేసి ఉండవచ్చని అంటున్నారట కొందరు. అదే సమయంలో కూటమి ఆఫర్స్‌కు పడిపోయారా అని కూడా మాట్లాడుకుంటున్నారట. కారణం ఏదైనా…. బలం ఉన్నచోట దాన్ని నిరూపించుకునే అవకాశం లేకుండా మనోహర్ దెబ్బతీశారన్న చర్చ జరుగుతోందట వైసీపీలో.