Buggamatham Lands: ఇవాళ తిరుపతిలోని బుగ్గమఠం భూముల సర్వే జరగనుంది. 16వ ఆర్థిక సంఘం పర్యటన నేపథ్యంలో గత నెలలో సర్వే వాయిదా పడింది. ఆక్రమిత బుగ్గమఠం భూముల సర్వే కోసం ఏప్రిల్ 11వ తేదీన దేవాదాయ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మరో నలుగురికి అధికారులు నోటీసులు ఇచ్చారు. 261/1, 261/2 సర్వే నెంబర్లలో 3.88 ఎకరాల భూమి ఆక్రమించినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ భూములతో తనకు సంబంధం లేదని తన తమ్ముడు ద్వారకానాథరెడ్డి కొనుగోలు చేశారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.