Chevireddy Bhaskar Reddy: చంద్రబాబుకు భయం పుట్టాలి.. చెవిరెడ్డి వాయిస్ మెసేజ్!
- మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్టు
- వైసీపీ కార్యకర్తలకు చెవిరెడ్డి వాయిస్ మెసేజ్
- జగన్ అన్న సైనికులుగా దేనికైనా సిద్దం
- ఎన్ని కేసులు పెట్టినా కూడా తట్టుకుని నిలబడతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని మంగళవారం సిట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెంగళూరు నుంచి శ్రీలంకకు పారిపోతుండగా.. చెవిరెడ్డిని విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆపై సిట్ అధికారులకు సమాచారం ఇవ్వగా.. మంగళవారం రాత్రి చెవిరెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను విజయవాడకు తరలించారు. ఈ అరెస్టుపై చెవిరెడ్డి వైసీపీ కార్యకర్తలకు, నేతలకు వాయిస్ మెసేజ్ పంపారు. చంద్రబాబుకు భయం పుట్టేలా నేతలు, కార్యకర్తలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెవిరెడ్డి కోరారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ వెంట నడిచే వారిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని, అందులో భాగంగానే తనను అరెస్టు చేశారని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. ‘రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. జగన్ అన్న వెంట నడిచే వారిపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా కూడా తట్టుకుని నిలబడతా, మీ అందరి ఆశీస్సులు నాకు ఉన్నాయి. నేను ఈరోజు రిలీజ్ అవుతా. పార్టీ కార్యక్రమాలు ఇప్పుడు ఊపందుకున్నాయి. పార్టీ కార్యకమాలను విజయవంతం చేయాలి. జగన్ అన్నకు మనం ఓ సైన్యంలా నిలబడాలి. ఆయన అడుగడునా వెంటే ఉండాలి’ అని చెవిరెడ్డి పిలుపునిచ్చారు.
Also Read
‘చంద్రబాబు నాయుడు నన్ను జైలుకు పంపుతాడు అనే నానుడి ఉంది. ఏ సంబంధం లేని నన్ను ఈ కేసులో ఇరికించారు. వారు ఏం చేసినా.. మనం జగన్ అన్న సైనికులం, గట్టిగా నిలబడే వాళ్లమే. చంద్రబాబుకు భయం పుట్టేలా మనం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి, పార్టీ కోసం నిత్యం పని చేయాలి. నేను బయటికి వచ్చాక మళ్లీ మాట్లాడుతా. నేను, నా కుటుంబ సభ్యులు జగన్ అన్నకు సైనికులం. ప్రతి ఒకరు వెనకడుగు వేయకుండా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనాలి’ అని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కోరారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!