Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు!
- మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
- కేసు నమోదు చేసిన సత్తెనపల్లి రూరల్ పోలీసులు
- బ్యారికేడ్స్ తొలగించి హంగామా చేసిన అంబటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, దురుసుగా ప్రవర్తించిన కారణంగా.. ఆయనపై సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 188, 332, 353, 427 సెక్షన్ల కింద పోలీసులు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. జగన్ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించడంపై నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సత్తెనపల్లి వైసీపీ ఇన్‌ఛార్జ్ గజ్జల భార్గవ్ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి దగ్గర అంబటి తన సోదరుడు మురళితో కలిసి బ్యారికేడ్స్ తొలగించి హంగామా చేశారు.
Also Read: ENG vs IND: సెలెక్షన్ నా చేతుల్లో లేదు.. ఇప్పటికీ ఆడేందుకు సిద్ధం: సీనియర్ బ్యాటర్
Also Read
- Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
- Sai Pallavi Saree Look: "మేడం సార్.. మేడం అంతే".. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
- TVS Raider 125 అప్‌డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
- KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామ ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు హాజరయ్యారు. జగన్ ర్యాలీ సందర్భంగా కంటెపూడి వద్ద పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. అక్కడ వైఎస్ జగన్ కాన్వాయ్‌తో పాటు మరికొన్ని వాహనాలు ముందుకెళ్లగా.. రద్దీని నియంత్రించేందుకు వెనుక ఉన్న వాహనాలను పోలీసులు ఆపేశారు. వాహనాలను ఎందుకు ఆపారని, వెంటనే పంపాలని పోలీసులతో అంబటి రాంబాబు వాదనకు దిగారు. జగన్ కాన్వాయ్‌కు ఇబ్బంది కలగకూడదనే వాహనాల్ని ఆపామని పోలీసులు వివరించినా.. ఆయన వినిపించుకోలేదు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన అంబటి తన సోదరుడు మురళితో కలిసి రోడ్డుపై అడ్డుగా పెట్టిన బారికేడ్లను నెట్టేశారు. అడ్డుచెప్పిన పోలీసులపై నోరు పారేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించడంపై సత్తెనపల్లి పోలీసులు అంబటిపై కేసులు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్‌డే పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
-
India Rice Exports: కేవలం 5 నెలల్లో బియ్యం ఎగుమతులతో రూ.45,739 కోట్లు.. భారత్‌కు భారీ ఆదాయం!
-
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
ట్రెండింగ్
-
TVS Raider 125 అప్‌డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..