YS Jagan: రెంటపాళ్లకు మాజీ సీఎం జగన్.. అడుగడుగునా నీరాజనం!
- జగన్‌కు అడుగడుగునా నీరాజనం పలుకుతున్న జనాలు
- గుంటూరులో ప్రతిచోటా జగన్‌కు అపూర్వ స్వాగతం
- అభిమానులు, కార్యకర్తలతో కిటకిటలాడిన గుంటూరు రోడ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరికాసేపట్లో చేరుకోనున్నారు. పోలీసుల వేధింపులతో గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని వైసీపీ అధినేత ఆవిష్కరించనున్నారు. పల్నాడు జిల్లా పర్యటన నేపథ్యంలో ప్రజలు జగన్‌కు నీరాజనాలు పలుకుతున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు గుంటూరు నగరంలో ప్రతిచోటా అపూర్వ స్వాగతం లభించింది. అడుగడుగునా స్వాగతం పలికేందుకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు రోడ్లపైకి వచ్చారు. ‘జయహో జగన్’ అంటూ నినదించారు. దాంతో గుంటూరులోకి ఎంటరై గంటన్నర అవుతున్నా.. జగన్ కాన్వాయ్ ముందుకు సాగడం లేదు. జగన్ కాన్వాయ్ వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గుంటూరు వై జంక్షన్, ఏటుకూరు రోడ్, లాల్‌పురం రోడ్డు మీదుగా చుట్టుగుంట మీదుగా జగన్ కాన్వాయ్ ముందుకు సాగింది. మహిళలు, పార్టీ కేడర్‌తో రోడ్లన్నీ నిండిపోయాయి. చుట్టుగుంట సెంటర్‌లో జగన్‌కు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఘన స్వాగతం పలికారు. మొత్తంగా అభిమానులు, కార్యకర్తలతో గుంటూరు రోడ్లు కిటకిటలాడాయి.
Also Read
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- Pakistan: "మక్కా ఒప్పందం అండగా లేదు".. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
- Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
Also Read: Chevireddy Bhaskar Reddy: చంద్రబాబుకు భయం పుట్టాలి.. చెవిరెడ్డి వాయిస్ మెసేజ్!
సత్తెనపల్లిలో వైసీపీ శ్రేణులు వైఎస్ జగన్‌కు స్వాగతం పలికాయి. బస్టాండ్ నుంచి ఐదు లాంతర్ల సెంటర్ వరకు పార్టీ కార్యకర్తలు భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారిలో సైరన్ మోగిస్తూ.. బైక్‌లపై నిలుచొని యువకులు హడావుడి చేశారు. జగన్ అందరికి అభివాదం చేస్తూ ముందుకు సాగరు. జై జగన్ నినాదాలతో జన సందోహంగా సత్తెనపల్లి రోడ్లన్నీ మారాయి. ఇక వైఎస్ జగన్ పర్యటనకు ఆయన కాన్వాయ్‌తో పాటు మూడు వాహనాలు, వంద మందికి మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు.
- Tags
- ap
- palnadu
- Rentapalla
- ycp
- ys jagan
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!