కొండపల్లి కొండను తవ్వింది ఎవరు? తవ్వుకుని లాభపడింది ఎవరు? కొండ కరుగుతున్న సమయంలో రాజకీయ సెగ ఎందుకు రాజుకుంది? పైచెయ్యి సాధించాలనే ఎత్తులు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయా? మాటలతో ఒకరు.. సాంకేతిక అంశాలతో ఇంకొకరు.. ఒకరినొకరు ఇరుకున పెట్టుకునే వ్యూహాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. కొండపల్లి కొండ మైనింగ్‌పై రగడ! కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో రాజకీయాలు సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ రగులుతూనే ఉంటాయి. ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత ఇలా పరిస్థితులు ఎలా ఉన్నా…
మొన్నటి ఎన్నికల సమయంలో ఆ నేతలిద్దరి ప్రచారానికి.. పరస్పర ఆరోపణలకు సోషల్ మీడియా మంచి వేదికైంది. పైసా ఖర్చులేని వ్యవహారం కావడంతో కేడర్, అభిమానులు ఏ పోస్టులు పెట్టినా గో ఏ హెడ్ అన్నారట ఆ ఇద్దరు. కట్‌చేస్తే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు మరీ శ్రుతిమించిపోతున్నాయట. దీంతో ఒకప్పుడు సంబరపడిన నేతలే ఇప్పుడు ఆ సోషల్ మీడియా పోస్టులకు ఫీలవుతున్నారట. ఇంతకీ నేతలకు సోషల్ మీడియా తెచ్చిన తలనొప్పులేంటి? ఇద్దరికీ ఎన్నికల్లో ఉపయోగపడ్డ సోషల్…
కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతుందని పరిశీలనకు వెళ్తున్న టీడీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేయడం దౌర్భాగ్యం అని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. మైనింగ్ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసిన నాయకులను ఎనిమిది మందిని అరెస్టు చేశారు. తేదేపా పార్టీ ఆఫీస్ కి వెళుతుండగా దౌర్జన్యంగా అరెస్టు చేసి మంగళగిరి నుంచి కొల్లిపర తీసుకు రావడంలో అర్థం ఏంటి. మైనింగ్ లో తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం ఏముంది. తప్పు చేస్తున్నారు కాబట్టి…
సామాజిక సమతౌల్యం సాధ్యం అవుతుందని చేసి చూపిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. తన గత ఐదేళ్ల హయాంలో రాజ్యసభ స్థానాలను అగ్ర కులాలతో నింపిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి పేర్నినాని అన్నారు. కేంద్రంలో రెండు మంత్రి పదవులు వస్తే ఒకటి కమ్మ, ఒకటి క్షత్రియకు ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు సిగ్గు లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ విధానాలను తప్పు పట్టలేక పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలో అలజడి సృష్టించి, దాడికి…
రాజోలు వైసీపీలో మళ్లీ ఆధిపత్య పోరు పీక్కు చేరుకుంది. ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న నాయకుడికి పదవి రావడంతో ఆయన జూలు విదిలిస్తున్నారు. మధ్యలో నా సంగతేంటని పార్టీ ఇంఛార్జ్ హూంకరింపులు మామూలే. ఇంకోవైపు అధికారపార్టీకి సపోర్ట్‌గా నిలిచిన ఎమ్మెల్యే ఎత్తుగడలు. మొత్తంగా ఈ మూడు ముక్కలాట పంచాయితీ తాడేపల్లి చేరుకుందనే చర్చ జరుగుతోంది. మరి అక్కడైనా పరిష్కారం లభిస్తుందా? రాజోలు వైసీపీలో మూడు ముక్కలాట! తూర్పుగోదావరి జిల్లా రాజోలు వైసీపీలో నెలకొన్న ఆధిపత్య పోరు అధిష్ఠానం పెద్దల…
పలాస – కాశీబుగ్గ మున్సిపాల్టీకి రెండో వైస్ ఛైర్మన్ గా ఒక దళిత సోదరుడు ఎన్నిక కావడం పలాస చరిత్రలో గొప్ప అధ్యాయం అని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా మంచి సోషలిస్టు. వెనుకబడిన, దళిత గిరిజన వర్గాలకు చెందిన ఐదుగురిని ఉపముఖ్యమంత్రులుగా చేశారు. అన్ని రాజకీయపదవులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్ జనగ్ కే దక్కుతుంది. ఇక చెత్త పై పన్నువేసే విషయంలో పలాస-కాశీబుగ్గ మున్సిపాల్టీ…
కడపజిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లెలో బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కత్తులతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. వైసిపికి చెందిన ముగ్గురు, బిజెపీకి చెందిన ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో బిజెపీకి చెందిన ముగ్గురు కార్యకర్తల పరిస్థితి విషమంగా ఉంది. బీజేపీ కార్యకర్తలు గోపు ప్రసాద్, చిన్న నరసింహులు, పెద్ద నరసింహులు గాయపడ్డారు. వైసీపీ కార్యకర్తలు నరేంద్ర, ఆంజనేయులు గాయపడగా…ఈ ఘర్షణలో గ్రామ వాలంటీర్ వెంకటేష్ కూడా గాయాలయ్యాయి. read also : హైదరాబాద్…
పదవుల పంపకాల్లో అనేక వడపోతలు.. లెక్కలు వేస్తాయి పార్టీలు. అధికారంలో ఉన్న పార్టీ అయితే మరెన్నో సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇటీవల ఏపీలో అదే జరిగిందని వైసీపీ వర్గాల్లో ఒక్కటే చర్చ. కాకపోతే ఆ జిల్లాలో మాత్రం విభజించు.. పాలించు సూత్రం పాటించారని చెవులు కొరుక్కుంటున్నారట. అదెలాగో ఇప్పుడు చూద్దాం. పదవుల పంపకంలో సామాజిక లెక్కలు! ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పదవుల పంపకాల్లో కృష్ణాజిల్లాకు కీలకమైన పోస్ట్‌లే దక్కాయి.కమ్మ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఏపి పరిశ్రమల అభివృద్ధి…
చేతికి పదవి వస్తే కొందరు గాలిలో తేలిపోతారు. అప్పటి వరకు చుట్టూ ఉన్నవాళ్లకు కూడా అందకుండా పోతారు. ఆ ఎమ్మెల్సీ సైతం అంతేననే టాక్ వైసీపీ కేడర్‌లో గట్టిగానే వినిపిస్తోంది. అయ్యవారు సోషల్ మీడియాలో చురుకు కావడంతో… ‘సార్..! మా గోడు’ పట్టించుకోండి అంటూ అదే సామాజిక మాధ్యమాల్లో రిక్వస్ట్లు పెడుతున్నారట. దీంతో పదవి రాకముందు దువ్వాడ.. పదవొచ్చాక దూరమయ్యాడా..! అని సెటైర్లు వేస్తున్నారట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. టెక్కలి వైసీపీ ఇంఛార్జ్ ఎమ్మెల్సీ దువ్వాడ!…