చంద్రబాబు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ప్రభుత్వం అప్పులు చేస్తుందన్న విమర్శల పై కౌంటర్ అటాక్ చేశారు. లక్షల కోట్లు అప్పులు చేసి మా నెత్తిమీద పెట్టి హైదరాబాద్ లో కూర్చున్నావ్. జగన్ మీద విశ్వాసం ఉంది కాబట్టే బ్యాంకులు అప్పులిస్తున్నాయి. మీరు చేసిన అప్పులు తీర్చుకుంటూ ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకునేందుకు జగన్ నానా కష్టాలు పడుతున్నారు. అగ్రిగోల్డ్ లో బోర్డు తిప్పేసిన ముసుగువీరులెవరో అందరికీ తెలుసు. నేనిప్పుడు ఆ పేర్లు చెబితే ఏడ్చి…
తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటున్నారట ఆ మాజీ పోలీస్ అధికారి. ప్రస్తుతం అధికారపార్టీలో ఉన్న ఆయన… ‘మద్దాలి నిన్నొదల’ అని వెంట పడుతున్నారు. ఎమ్మెల్యేకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారట. ఇద్దరూ ఒకేపార్టీలో.. ఒకే గొడుకు కింద ఉన్నా.. రాజకీయ ఎత్తుగడలు గుంటూరు మిర్చిలా ఘాటెక్కిస్తున్నాయట. వారెవరో? ఆ గొడవేంటో ఈ స్టోరీలో చూద్దాం. మద్దాలిని ముప్పుతిప్పలు పెడుతున్న ఏసురత్నం! గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా…
నేడు కుటుంబం తో కలిసి సిమ్లా కు వెళ్లనున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ నెల 28వ తేదీన వైఎస్ జగన్ జీవితంలో ఓ స్పెషల్డే కానుంది.. అదే జగన్-భారతి పెళ్లిరోజు.. పెళ్లి రోజు మాత్రమే కాదు.. సిల్వర్ జూబ్లీ జరుపుకోనున్నారు.. వైఎస్ జగన్-భారతి పెళ్లి జరిగి 25 ఏళ్లు కావస్తుంది.. ఈ సందర్భంగా.. రాజకీయాలు, సీఎం బాధ్యతలకు దూరంగా ఐదు రోజుల పాటు పూర్తిగా ఫ్యామిలీతో గడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే…
కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర ఏపీ బీజేపీ నేతలకు ఊపు తెచ్చిందా? లేక ఆ ఒక్క విజిట్తో అంతా తారుమారైందా? ఇంతకీ ఆ భేటీ ముందుగానే ప్లాన్ చేశారా? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! కేంద్ర పథకాలకు రాష్ట్రాలు స్టిక్కర్లు వేస్తున్నాయని కిషన్రెడ్డి విమర్శ! కేంద్ర కేబినెట్లో పదోన్నతులు పొందిన మంత్రులు.. ఆయా రాష్ట్రాల్లో జన ఆశీర్వాద యాత్రలు మొదలుపెట్టారు. ఆ విధంగా ఏపీకి వచ్చారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి. తిరుపతి,…
చాలా కాలం వేచి చూసిన తర్వాత వారికి అధికార యోగం పట్టింది. పాలకవర్గంలోకి ఇలా వచ్చారో లేదో పెత్తనం చేయడం మొదలు పెట్టారు. విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఆ ప్రజాప్రతినిధుల దూకుడుకు కళ్లెం వేయడం అధికారులకు సవాల్గా మారిందట. వారెవరో ఏంటో లెట్స్ వాచ్! కొందరు కార్పొరేటర్లు సర్వ అధికారాలు ఉన్నాయని ఫీలవుతున్నారా? పదేళ్లకుపైగా ప్రత్యేక అధికారి పాలనలో సాగిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో 98 డివిజన్లకు ఇటీవలే ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గం కొలువు తీరింది.…
ఆంధ్రప్రదేశ్ వైకాపాబన్లు… అరాచకాలలో ఆప్ఘనిస్థాన్ తాలిబన్లని మించిపోయారని నారా లోకేష్ సెటైర్లు వేశారు. తన తాడేపల్లి ప్యాలస్ పక్కన ఎవ్వరూ ఉండటానికి వీల్లేదని, నిరుపేదల ఇళ్లను జగన్ రెడ్డి కూల్చేసారని మండి పడ్డారు. ఇప్పుడు భద్రత పేరుతో భరతమాత గుండెలపై గునపం దింపారని..నిప్పులు చెరిగారు. తనకి 2 కోట్లతో గుడి కట్టించుకున్న జగన్ రెడ్డి… తన ఇంటి దగ్గర భరతమాత విగ్రహాన్ని తొలగించడం ఆయన నిరంకుశ, ఫ్యాక్షన్ బుద్ధికి నిదర్శనమన్నారు నారా లోకేష్. ప్రొక్లయినర్లతో పెకలించిన భరత…
ఇల వైకుంఠంలో ఆయన సామాన్య భక్తులకు ప్రాధాన్య ఇవ్వాలన్నారు. తమ అనుచరులకు బాగా దర్శనం జరిగితే చాలనుకుంటున్నారు వాళ్లు. దర్శనం విధానంలో మార్పులు తీసుకొస్తే తూట్లు పొడుస్తున్నారు కూడా. ఇంతకీ ఆయన తెచ్చిన మార్పులేంటి? అడ్డుపడుతున్నవారు ఎవరు? లెట్స్ వాచ్! అనుచరులకు ప్రొటోకాల్ దర్శనం కోరుకుంటున్న ప్రజాప్రతినిధులు! టీటీడీ పాలకమండలి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా బ్రేక్ దర్శనంలో మార్పులు తీసుకొచ్చారు. అప్పటి వరకు ఉన్న ఎల్ 1,…
రాష్ట్రస్థాయి పదువులొస్తున్నాయంటే ఎగిరి గెంతులేశారు. ఏదేదో చేసేద్దామని బోల్డన్ని లెక్కలేసుకున్నారు. తీరా పదవులొచ్చాయక ఏమీ చేయలేక ఆవేదన చెందుతున్నారట. కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా లేదట. వారెవరో.. ఆ బాధేంటో ఇప్పుడు చూద్దాం. పదవులు రావడంతో గుర్తింపు లభించిందని సంతోషించారు! ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో శ్రీకాకుళం జిల్లాకు ప్రాధాన్యం దక్కింది. వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్ పోస్టులతోపాటు డైరెక్టర్ పదవులు దక్కాయి. సామాజికవర్గాల వారీగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున నిధులు వస్తాయని..…
ఆ శాఖ అధికారులు రోడ్డెక్కినా.. ఆఫీసులో కూర్చున్నా డబ్బే డబ్బు. ప్రభుత్వ ఖజానాకు ఆ శాఖద్వారా వచ్చే ఆదాయం కంటే.. వారి ప్రైవేట్ సంపాదనే ఎక్కువన్నది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు కరోనాతో వ్యక్తిగత ఇన్కమ్కు గండిపడటంతో విరుగుడు కనిపెట్టారట. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం. ప్రైవేట్ ట్రావెల్స్తో సొంత ఒప్పందాలు? అవినీతిలో మిగతా అన్ని ప్రభుత్వ విభాగాలంటే రెండాకులు ఎక్కువే చదివారని రవాణశాఖపై తరచూ విమర్శలు వస్తుంటాయి. ఆ శాఖలో వెలుగు చూసే యవ్వారాలు కూడా ఆ…
టీడీపీ నాయకులు గోరంట్ల బుచ్చయ్య రాజీనామా వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తన స్టైల్ లో స్పందించారు. బుచ్చయ్య రాజీనామా వ్యవహారంతో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయంటూ ఆయన పేర్కొన్నారు. “‘బుచ్చయ్య రిజైన్ చేస్తారో లేదో గాని ఆయన చెప్పిన నిజాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కొని పొరపాటు చేశారని తప్పు బట్టానని చెప్పారు. అలా నిలదీసినందుకు బాబు తనతో రెండేళ్లు మాట్లాడలేదట. ప్రజలు బాబును ఐదేళ్లు తరిమారు. సూపర్…