అవినీతిలో గుంటూరు రవాణా అధికారుల తీరే వేరా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ శాఖ అధికారులు రోడ్డెక్కినా.. ఆఫీసులో కూర్చున్నా డబ్బే డబ్బు. ప్రభుత్వ ఖజానాకు ఆ శాఖద్వారా వచ్చే ఆదాయం కంటే.. వారి ప్రైవేట్ సంపాదనే ఎక్కువన్నది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు కరోనాతో వ్యక్తిగత ఇన్‌కమ్‌కు గండిపడటంతో విరుగుడు కనిపెట్టారట. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం.
ప్రైవేట్ ట్రావెల్స్‌తో సొంత ఒప్పందాలు?
Also Read
అవినీతిలో మిగతా అన్ని ప్రభుత్వ విభాగాలంటే రెండాకులు ఎక్కువే చదివారని రవాణశాఖపై తరచూ విమర్శలు వస్తుంటాయి. ఆ శాఖలో వెలుగు చూసే యవ్వారాలు కూడా ఆ ప్రచారాలను బలపరిచేలా ఉంటాయి. సెంటీమీటర్ సంధు ఇస్తే.. కిలోమీటర్ దూసుకెళ్లే ఘనులు ఉన్న డిపార్ట్‌మెంట్. అక్కడ పనోళ్లకు కొదవేం లేదు. ఆ విధంగా గుంటూరు రవాణా అధికారులు చర్చల్లోకి వచ్చారు. కరోనాతో దెబ్బతిన్న సొంత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకునేందుకు ఏకంగా ట్రావెల్ ఏజెంట్లు.. వెహికల్ యజమాన్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అవినీతి అధికారులు చెప్పినదానికి ప్రైవేట్ ట్రావెల్స్ ఖుషీ!
ప్యాసింజర్ క్యారియర్‌గా తిరిగేందుకు ఏ వాహనాన్నైనా వాడుకోండి.. తమకు ఇచ్చేది ఇస్తే చాలు అని చెప్పి డీల్ చేసుకున్నారట. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ఎగిరి గెంతేశారట. వాస్తవానికి ప్రైవేట్ ట్రావెల్స్‌లో వాహనాలు తిప్పాలంటే ఆ వెహికల్స్‌కు తప్పనిసరిగా యల్లో నెంబర్ ప్లేట్స్ ఉండాలి. వాటికి ట్యాక్స్ ఎక్కువ పడుతుంది. మూడు నెలలకోసారి రోడ్ ట్యాక్స్ కట్టాలి. బోర్డర్ పన్నులు.. ఫిట్‌నెస్ టెస్ట్‌లు సరేసరి. వచ్చే ఆదాయంలో వాహన యజమానులకు మిగిలేది తక్కువ. దీంతో రవాణా అధికారులు చెప్పిన డీల్‌కు ఓకే చెప్పేశారట ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు. దానిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.
ఒక్కో వాహనానికి రూ.5 వేలు వసూలు!
అవినీతి అధికారులు ఇచ్చిన హామీతో రోడ్డెక్కిన 50 వేల వాహనాలు?
ఇటీవల ప్రభుత్వం ఒక విధానం తీసుకొచ్చింది. వైట్ నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలకు ఏడాదికి 24 వేలు కడితే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కు ఉపయోగించుకునే వీలు కల్పించింది. దీంతో ఈ వెసులుబాటును అనుకూలంగా మలుచుకున్నారట అవినీతి అధికారులు. ఒక్కో వెహికల్‌కు ఏడాదికి 5 వేల చొప్పున ఇస్తే.. ఏదైనా చేసుకోవచ్చని.. తాము పట్టుకోబోమని సెలవిచ్చారట. ఆ మాట వినగానే ఎల్లో నెంబర్ ప్లేట్ వాహనాలను పక్కన పెట్టి.. వైట్ నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు రోడ్డెక్కించేశారు టావెల్స్ యజమానులు. ఈ విధంగా ఒక్క గుంటూరు పరిధిలోనే 50 వేల వాహనాలు రయ్‌మని రోడ్లపై పాసింజర్ కారియర్లుగా దూసుకెళ్తున్నాయి. కరోనా వల్ల ఆదాయానికి గండిపడి విలవిల్లాడుతున్న అధికారులు.. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును ఈ విధంగా వాడేసుకున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి.. సొంత ఖాజానా నింపుకొనేందుకు పోటీ!
నిజానికి కరోనా వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. దాని నుంచి బయట పడేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు పాలకులు. కానీ.. వాటికీ చిల్లుపెట్టి సొంత జేబులు నింపుకొంటున్నారు అవినీతి ఘనులు. క్రషర్‌లకు వెళ్తున్న లారీల నుంచి కూడా స్పెషల్ కరోనా ట్యాక్స్ వసూలు చేస్తున్నారట. మొత్తానికి తమ అవినీతికి ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న అక్రమార్కులను చూసి ఇతర ప్రభుత్వ విభాగాల వాళ్లు నోళ్లెళ్ల బెడుతున్నారట.
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..