ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న వారి ఆస్తుల జప్తునకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. రూ.32 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసేందుకు అనుమతి ఇస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులకు ఆగస్ట్ ఒకటో తేదీ లోపు నోటీసులు ఇవ్వాలని దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది. గతంలో ఎన్నికల సమయంలో చిల్లకల్లు వద్ద పట్టుబడిన రూ.8కోట్ల నగదు సహా డిస్టిలరీలు, నిందితుల అనుమానాస్పద…
మహిళల మీద చెయ్యి వేస్తే తాట తీస్తా అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి సెటైర్లు వేశారు. 50 మంది మహిళను నెల రోజుల నుంచి వేధిస్తే.. పవన్ కళ్యాణ్ గారు ఏం చర్యలు తీసుకున్నారు అని ప్రశ్నించారు. టీడీపీ నేతల మద్దతుతో మహిళలు, చిన్నారులపై హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. హోం మంత్రి వంగలపూడి అనిత నివాసానికి కూత వేటు దూరంలో…
శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేట గ్రామానికి చెందిన వైసీపీ నేత, ఉప సర్పంచ్ సత్తారు గోపి దారుణ హత్యకు గిరయ్యది. కోయిరాల జంక్షన్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు కొందరు గోపిపై రాడ్లు, కత్తులతో దాడి చేసి హత్య చేశారు. తల, మెడపై తీవ్ర గాయాలు కావడంతో గోపి అక్కడిక్కడే మృతి చెందాడు. రక్తపు మడుగులో పడిఉన్న గోపి మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. బైక్‌పై వెళ్తుండగా గోపిపై…
2024 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ కుటుంబం క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు తాము చాలా భాధపడ్డాం అని వైసీపీ నేత జక్కంపూడి గణేష్ తెలిపారు. ల్యాండ్ మాఫియా, బెట్టింగ్ క్లబ్‌ల మీద తమపై చేసిన ఆరోపణలు నిరూపించమని ప్రశ్నిస్తున్నామన్నారు. తమపై ఆరోపణలు రుజువు చేయండి, లేదంటే చేతగాని వాళ్లమని ఒప్పుకోండన్నారు. తమ క్యారెక్టర్‌పై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుందని జక్కంపూడి గణేష్ హెచ్చరించారు. Also Read: TV Rama Rao: జనసేన…
వైఎస్ జగన్ అంటేనే జనం అని, ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారని వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. మామిడి రైతుల్లో భరోసా నింపడానికి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మేలు చేయడానికి జగన్ బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు వచ్చారన్నారు. దేశంలోనే మా నాయకుడు వైఎస్ జగన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ ఉన్న లీడర్ అని పేర్కొన్నారు. రైతుల్లో భరోసా కల్పించడానికి పర్యటన చేస్తే.. తమ నాయకులను…
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన నలుగురు వైసీపీ జెడ్పీటీసీలు జనసేనలో చేరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా కప్పుకున్నారు. జనసేనాని నలుగురు జెడ్పీటీసీలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చింతలపూడి జెడ్పీటీసీ సభ్యులు పొల్నాటి శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం జెడ్పీటీసీ సభ్యులు ముత్యాల ఆంజనేయులు, అత్తిలి జెడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి, పెరవలి జెడ్పీటీసీ సభ్యురాలు కొమ్మిశెట్టి రజనీ జనసేన పార్టీలో చేరారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను…
ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారమే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ర్యాలీలు చేస్తున్నారన్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రైతుల సమస్య పరిష్కరించాలన్న ఆలోచనే జగన్‌కు అస్సలు లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే రోడ్లపై మామిడిని పోశారని, క్రిమినల్ మైండ్‌తోనే ఇలాంటి పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎంగా పని చేసిన వ్యక్తి.. ఇలాంటి పనులతో సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఏపీ…
Chittoor Police: రేపు చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లాలోకి వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
వైసీపీలో వర్గ పోరుకు కేరాఫ్ చింతలపూడి నియోజకవర్గం అన్న పేరుంది. ఇక్కడ పనిచేసే వారికంటే...ఇతరులే పైచేయి కోసం ప్రయత్నిస్తారని, అదే అసలు సమస్య అని చెప్పుకుంటారు.
Minister Anam: నెల్లూరు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘాటుగా స్పందించారు. సభ్య సమాజం తలదించుకునేలా మహిళ శాసన సభ్యురాలు ప్రశాంతి రెడ్డిపై వైసీపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు.