Mudragada Padmanabham: కాపు సంఘం నాయకుడు, మాజీ మంత్రి, వైసీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగానే ఉందని ముద్రగడ తనయులు బాలు, గిరిబాబు తెలిపారు. ఇక, మా తండ్రి ఆరోగ్యం పట్ల వస్తున్న వదంతులు నమ్మవద్దు అని సూచించారు. ముద్రగడ ఆరోగ్యంపై దయచేసి అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని మీ అందరి అభిమానాలతో మా నాన్న క్షేమంగా త్వరలోనే తిరిగి వస్తారని చెప్పుకొచ్చారు. ఇక, ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు.
Read Also: Shocking : పీవీఆర్ సెంట్రల్ లో ‘కుబేర’ సినిమా పైరసీ
అయితే, మా కుటుంబం పట్ల మా తండ్రి (ముద్రగడ పద్మనాభం) ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుంది అని ముద్రగడ బాలు, గిరిబాబు పేర్కొన్నారు. మా నాన్నని పరామర్శించడానికి వచ్చిన వైసీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులతో పాటు మా తండ్రి ఆరోగ్యం కోసం పూజలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ముద్రగడ తనయులు అన్నారు.