వైఎస్ జగన్ అంటేనే జనం అని, ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారని వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. మామిడి రైతుల్లో భరోసా నింపడానికి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మేలు చేయడానికి జగన్ బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు వచ్చారన్నారు. దేశంలోనే మా నాయకుడు వైఎస్ జగన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ ఉన్న లీడర్ అని పేర్కొన్నారు. రైతుల్లో భరోసా కల్పించడానికి పర్యటన చేస్తే.. తమ నాయకులను…
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన నలుగురు వైసీపీ జెడ్పీటీసీలు జనసేనలో చేరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా కప్పుకున్నారు. జనసేనాని నలుగురు జెడ్పీటీసీలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చింతలపూడి జెడ్పీటీసీ సభ్యులు పొల్నాటి శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం జెడ్పీటీసీ సభ్యులు ముత్యాల ఆంజనేయులు, అత్తిలి జెడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి, పెరవలి జెడ్పీటీసీ సభ్యురాలు కొమ్మిశెట్టి రజనీ జనసేన పార్టీలో చేరారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను…
ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారమే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ర్యాలీలు చేస్తున్నారన్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రైతుల సమస్య పరిష్కరించాలన్న ఆలోచనే జగన్కు అస్సలు లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే రోడ్లపై మామిడిని పోశారని, క్రిమినల్ మైండ్తోనే ఇలాంటి పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎంగా పని చేసిన వ్యక్తి.. ఇలాంటి పనులతో సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఏపీ…
Chittoor Police: రేపు చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లాలోకి వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
వైసీపీలో వర్గ పోరుకు కేరాఫ్ చింతలపూడి నియోజకవర్గం అన్న పేరుంది. ఇక్కడ పనిచేసే వారికంటే...ఇతరులే పైచేయి కోసం ప్రయత్నిస్తారని, అదే అసలు సమస్య అని చెప్పుకుంటారు.
Minister Anam: నెల్లూరు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘాటుగా స్పందించారు. సభ్య సమాజం తలదించుకునేలా మహిళ శాసన సభ్యురాలు ప్రశాంతి రెడ్డిపై వైసీపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు.
Minister Payyavula: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజలు, ఖజానాపై మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బాగా ప్రేమ చూపిస్తున్నారు అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద దండయాత్ర చేస్తానంటే ఊరుకోమంటూ హెచ్చరించారు. అధికారం ఉందని విర్రవీగితే ప్రజలే సమాధానం చెప్తారన్నారు. ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వాలు పని చేయాలన్నారు. ధర్నాల పేరుతో వైసీపీ నేతలు దోపిడికి తెగబడుతున్నారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు వినియోగించకపోవడంతో వ్యవసాయ రంగం చిన్నా భిన్నమైందని మంత్రి అచ్చెన్నాయుడు…
Minister Kollu Ravindra: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అధికారం కోల్పోయి మతిభ్రమించి మాట్లాడుతున్నారు అని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు అరాచకాలు చేసి.. ప్రజలను పీడించుకొని తిని.. ఈరోజు నీతులు చెబుతున్నారు అని పేర్కొన్నారు.
Atchannaidu: 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంకులో CNG గ్యాస్ ను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పుకొచ్చారు.