Naveen Nischal: సస్పెన్షన్ కానుకగా ఇచ్చినా.. బ్రతికున్నంత వరకు వైసీపీలోనే!
- నవీన్ నిశ్చల్‌పై వైసీపీ సస్పెన్షన్ వేటు
- సస్పెన్షన్ కానుకగా ఇచ్చారని నవీన్ ఆవేదన
- 15 ఏళ్లు బాలకృష్ణతో పోరాడా
- కొందరు పెద్దలు నా సస్పెన్షన్ వెనుక ఉన్నారు
- హిందూపురం వైసీపీని నాశనం చేయాలనుకుంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేస్తే.. సస్పెన్షన్ కానుకగా ఇచ్చారని వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఏపీ ఆగ్రోస్ మాజీ చైర్మన్ నవీన్ నిచ్చల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉరి తీసేటప్పుడు కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని, వైసీపీ అధిష్టానం తనను ఏమీ అడగలేదని మండిపడ్డారు. 15 ఏళ్లు నందమూరి బాలకృష్ణతో పోరాడి పార్టీ కోసం పని చేశానని.. తనని కాదని ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చినా పార్టీ కోసం పని చేశానన్నారు. తన సస్పెన్షన్ వెనుక కొందరు పెద్దలు ఉన్నారని.. ఈరోజు కాకపోయినా ఏదో ఓరోజు పార్టీ నిజానిజాలు తెలుకుంటుందన్నారు. తనకు వైఎస్ఆర్ అంటే ఇష్టమని.. ఆ తర్వాత వైఎస్ జగన్ అంటే ఇష్టమని తెలిపారు. తాము మరొక పార్టీలోకి వెళ్లేది లేదని.. బ్రతికున్నంత వరకు వైసీపీ కార్యకర్తలకు, తన మనుషులకు అండగా ఉంటా అని నవీన్ నిచ్చల్ స్పష్టం చేశారు.
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నవీన్ నిశ్చల్‌ని వైసీపీ అధిష్టానం బుధవారం సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులతో క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ వేటు వేసింది. సస్పెండ్ అనంతరం నవీన్ నిచ్చల్ మీడియాతో ఈరోజు మాట్లాడారు. ’15 ఏళ్లు బాలకృష్ణతో పోరాడి పార్టీ కోసం పని చేశాను. నన్ను కాదని ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చినా పార్టీ కోసం పని చేశాను. నేను పని చేయలేదని ఇక్బాల్, దీపికలను ప్రమాణం చేయమనండి. నేను చిత్తశుద్ధితో పని చేస్తే సస్పెన్షన్ కానుకగా ఇచ్చారు. నేను పోటీ చేసినప్పుడు 7వేలు మాత్రమే తేడా ఉంది. ఇక్బాల్ 20వేలు, దీపిక 30వేల తేడాతో ఓడిపోయారు. 2019లో నాకు టికెట్ ఇచ్చి ఉంటే వెయ్యి శాతం వైసీపీ గెలిచేది. డే వన్ నుంచి ఒక కుట్రతోనే నాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. కొందరు పెద్దలు నా సస్పెన్షన్ వెనుక ఉన్నారు.. పేర్లు చెప్పను. ఈరోజు కాకపోయినా పార్టీ నిజానిజాలు తెలుకుంటుంది’ అని నవీన్ నిచ్చల్ అన్నారు.
Also Read
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
‘కార్యకర్తకు కష్టం వస్తే నిలబడే నాయకుడు నేను మాత్రమే. నన్ను సాకుగా చూపి.. వారు లబ్ధి పొందుతున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో ఇప్పుడు వెయ్యి శాతం విఫలమవుతారు. పార్టీ నన్ను సస్పెండ్ చేసినా నాకొచ్చిన నష్టం ఏమీ లేదు. 2009లో నన్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది.. 2014లో పోటీ చేశాను. నేను వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ ఎంత బలంగా ఉందో తెలుకోండి. వైఎస్ జగన్ నాకు 2 సార్లు టికెట్ ఇవ్వకపోయినా.. నేను ఆయన కోసం పని చేశాను. నాకు వైఎస్ఆర్ అంటే ఇష్టం.. ఆ తర్వాత జగన్ అంటే ఇష్టం. నేను మరొక పార్టీలోకి వెళ్లేది లేదు. నేను బ్రతికున్నంత వరకు వైసీపీ కార్యకర్తలకు, నా మనుషులకు అండగా ఉంటా. నా వాళ్లకు నేను తోడుంటా.. ప్రత్యర్థులను ఎదుర్కొంటా. హిందూపురం వైసీపీని నాశనం చేయాలనుకుంటున్నారు. ఆ ఉచ్చులో వైసీపీ అధిష్టానం పడవద్దని కోరుకుంటున్నాను’ అని నవీన్ నిచ్చల్ సూచించారు.
తాజావార్తలు
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!