న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు భారత బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. మొదటి టెస్టు రెండోరోజు ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై కివీస్ బౌలర్లు చెలరేగడంతో టీమిండియా స్టార్ బ్యాటర్లు కుదేలయ్యారు. రోహిత్ శర్మ (2) ఖాతా తెరవగా.. విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు డకౌట్ అయ్యారు. ప్రస్తుతం భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. రిషబ్ పంత్ ఆడుకుంటేనే భారత్ కోలుకుంటుంది.…
ప్రతీ టెస్టు సిరీస్ తర్వాత ‘ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును బీసీసీఐ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. రాహుల్ ద్రవిడ్ పదవీ కాలంలో ప్రవేశపెట్టిన అవార్డును.. గౌతమ్ గంభీర్ కోచ్‌గా వచ్చాక కూడా బీసీసీఐ కొనసాగిస్తోంది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ అనంతరం ఫీల్డింగ్‌లో మెరిసిన ఆటగాళ్లకు అవార్డును ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ప్రకటించారు. ఈసారి ఇద్దరు ప్లేయర్లకు దక్కడం విశేషం. వెనక్కి డైవ్ చేస్తూ సూపర్ క్యాచ్ పట్టిన మహ్మద్ సిరాజ్‌తో పాటు సిరీస్…
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 95 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ సేన మూడు వికెట్లు కోల్పోయి అందుకున్నది. దీంతో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. కెప్టెన్ రోహిత్ (8), గిల్ (6) విఫలమైనప్పటికీ.. జైస్వాల్ (51), కోహ్లీ (29 నాటౌట్) రాణించారు. ఈ సిరీస్ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టాప్‌లో…
టెస్టుల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సరికొత్త రికార్టు నెలకొల్పింది. అత్యల్ప బంతుల్లో 50 పరుగులు చేసింది. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 18 బంతుల్లోనే 50 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఈ అరుదైన రికార్డును సాధించారు. దాంతో ఇంగ్లండ్ రికార్డు బద్దలైంది. గతంలో ఇంగ్లీష్ జట్టు 26 బంతుల్లో 50 రన్స్ చేసింది. భారత్ టెస్టు క్రికెట్‌లో వేగవంతమైన హాఫ్ సెంచరీ కూడా ఇదే. రోహిత్…
Yashasvi Jaiswal Record: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ గురువారం ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 19న చెన్నైలో ఆరంభం కానుంది. ఈ సిరీస్‌లో విజయం సాధించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా తన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. డబ్ల్యూటీసీలో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డును అందుకోనున్నాడు. డబ్ల్యూటీసీ 2023-25లో…
పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో భారత బ్యాటర్లు చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి భారత్ 213 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (40), శుభ్‌మన్ గిల్ (34) శుభారంభం అందించగా.. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (58), రిషభ్ పంత్ (49) కూడా దంచికొట్టారు.
Yashasvi Jaiswal smashes world record in T20Is: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కనివినీ ఎరుగని రికార్డు నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో తొలి బంతికే 13 రన్స్ రాబట్టిన తొలి బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. జింబాబ్వేతో ఆదివారం జరిగిన ఐదో టీ20లో యశస్వి ఈ ఫీట్ నమోదు చేశాడు. 21 ఏళ్ల టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ బ్యాటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. ప్రస్తుతం ఈ రికార్డుకు సంబంధించిన…
జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20 యశస్వి జైస్వాల్ చెలరేగిన విషయం తెలిసిందే. 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 93 రన్స్ చేశాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన జైస్వాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన యశస్వి.. సెంచరీ చేసేలా కనిపించినా ఆ ఫీట్‌ను అందుకోలేకపోయాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడి.. యశస్వి సెంచరీ చేయకుండా అడ్డుపడ్డాడని కొంతమంది నెటిజన్లు విమర్శలు చేశారు. మ్యాచ్…
IND vs ZIM Playing 11: జోరుమీదున్న భారత్ మరో పోరుకు సిద్ధమైంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా నేడు జింబాబ్వే, భారత్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి టీ20లో అనూహ్యంగా పరాజయం పాలైన టీమిండియా.. రెండో టీ20లో పంజా విసిరింది. ఇక యువ భారత్‌ను ఆపడం ఆతిథ్య జట్టుకు కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే జట్టులోకి ప్రపంచకప్ విన్నర్స్ శివమ్ దూబె, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ చేరారు.…
దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్ భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం కాలేదు. అయితే ఈ ఆటగాళ్లు 2024 టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ కారణంగా, ఈ నలుగురు ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చకుండానే గెలుచుకున్నారు.