IND vs BAN: రెండో టెస్టులో ఘన విజయం.. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్!
- రెండో టెస్టులో భారత్ సూపర్ విక్టరీ
- 2-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్
- ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న అశ్విన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 95 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ సేన మూడు వికెట్లు కోల్పోయి అందుకున్నది. దీంతో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. కెప్టెన్ రోహిత్ (8), గిల్ (6) విఫలమైనప్పటికీ.. జైస్వాల్ (51), కోహ్లీ (29 నాటౌట్) రాణించారు. ఈ సిరీస్ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
వర్షం కారణంగా రెండు రోజుల పాటు ఆట సాగలేదు. తొలి రోజు కేవలం 35 ఓవర్లే పడ్డాయి. ఈ పరిస్థితుల్లో మ్యాచ్ డ్రా అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ భారత్ దూకుడుగా ఆడి.. ఊహించని ఫలితంను అందుకుంది. బంగ్లాను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆలౌట్ చేసి అద్భుత విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లా 233 పరుగులు చేయగా.. భారత్ 285/9 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 146 పరుగులకే ఆలౌట్ కాగా.. భారత్ 95 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఈ టెస్ట్ మ్యాచులో భారత్ టీ20 క్రికెట్ ఆడింది.
Also Read
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Delhi: ఢిల్లీ హోటళ్లలో రూమ్‌ల కొరత.. ఆకాశాన్నంటుతున్న ధరలు.. కారణం ఇదే!
- Low Cost Smartphones: రూ.9,999కే 5జీ స్మార్ట్ ఫోన్స్.. 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో మార్కెట్లో లాంచ్..
- PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
Also Read: Mahindra Thar ROXX: అక్టోబర్ 3 నుంచి ‘థార్ రాక్స్’ బుకింగ్స్.. ఎగబడుతున్న జనం!
అద్భుత విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. దాంతో స్వదేశంలో వరుసగా 18వ సిరీస్ భారత్ ఖాతాలో చేరింది. యశస్వి జైస్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా.. రవిచంద్రన్ అశ్విన్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును అందుకున్నాడు. ఈ సిరీస్ విజయంతో టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ తన టాప్ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఇకపై ఆడే ఎనిమిది టెస్టుల్లో మూడు గెలిచినా.. భారత్ టాప్-2లో ఉంటుంది.
తాజావార్తలు
-
Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
-
Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
-
Delhi: ఢిల్లీ హోటళ్లలో రూమ్‌ల కొరత.. ఆకాశాన్నంటుతున్న ధరలు.. కారణం ఇదే!
-
మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
-
Low Cost Smartphones: రూ.9,999కే 5జీ స్మార్ట్ ఫోన్స్.. 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో మార్కెట్లో లాంచ్..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!