IND vs BAN: అరుదైన రికార్డుపై యశస్వి జైస్వాల్ కన్ను.. కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
- సెప్టెంబర్ 19 నుంచి టెస్ట్ సిరీస్
- అరుదైన రికార్డుపై కన్నేసిన యశస్వి
- మరో 8 సిక్స్‌లు బాదితే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yashasvi Jaiswal Record: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ గురువారం ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 19న చెన్నైలో ఆరంభం కానుంది. ఈ సిరీస్‌లో విజయం సాధించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా తన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. డబ్ల్యూటీసీలో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డును అందుకోనున్నాడు.
డబ్ల్యూటీసీ 2023-25లో యశస్వి జైస్వాల్ మరో 132 పరుగులు చేస్తే ఒక డబ్ల్యూటీసీ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పుతాడు. ఈ డబ్ల్యూటీసీలో యశస్వి ఇప్పటివరకు 1028 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అజింక్య రహానే, రోహిత్ శర్మ తర్వాత ఓ సింగిల్ ఎడిషన్‌లో వెయ్యికి పైగా రన్స్ చేసిన మూడో భారత ఆటగాడిగా నిలుస్తాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో యశస్వి ఈ రికార్డును అందుకునే అవకాశముంది.
Also Read
- Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
2019-21 ఎడిషనల్‌లో అజింక్య రహానె (1159) పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. మొత్తంగా చూసుకుంటే డబ్ల్యూటీసీ 2023-25లో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (1398) పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ డకెట్ (1028)తో కలిసి యశస్వి రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మరో 8 సిక్స్‌లు బాదితే ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా మరో రికార్డు నెలకొల్పుతాడు. న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్‌కల్లమ్ (33 సిక్స్‌లు, 2014) అగ్ర స్థానంలో ఉన్నాడు. బెన్ స్టోక్స్ (26 సిక్స్‌లు, 2022), యశస్వి జైస్వాల్ (26 సిక్స్‌లు, 2024) రెండో స్థానంలో ఉన్నారు.
తాజావార్తలు
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!