జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20 యశస్వి జైస్వాల్ చెలరేగిన విషయం తెలిసిందే. 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 93 రన్స్ చేశాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన జైస్వాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన యశస్వి.. సెంచరీ చేసేలా కనిపించినా ఆ ఫీట్‌ను అందుకోలేకపోయాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడి.. యశస్వి సెంచరీ చేయకుండా అడ్డుపడ్డాడని కొంతమంది నెటిజన్లు విమర్శలు చేశారు.
మ్యాచ్ అనంతరం యశస్వి జైస్వాల్ అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా సెంచరీ మిస్ కావడంపై స్పందించాడు. ‘శుభ్‌మన్ గిల్, నేను మ్యాచ్‌ను త్వరగా పూర్తి చేయడం గురించి మాత్రమే ఆలోచించాం. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా విజయం సాధించాలని మైదానంలోకి దిగాం. ఈ రోజు నా ఆటను పూర్తిగా ఆస్వాదించాను. గిల్‌తో కలిసి బ్యాటింగ్‌తో చేయడం బాగుంది. మంచి స్కోరు సాధించినందుకు ఆనందంగా ఉంది. భారత్ కోసం ఆడటం గర్వంగా ఉంటుంది’ అని యశస్వి తెలిపాడు.
Also Read: Milk Viral Video: ఏం టాలెంట్ భయ్యా.. ఒలింపిక్స్‌కు పంపిస్తే పతకం ఖాయం!
యశస్వి జైస్వాల్ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఊపులో సెంచరీ కూడా చేసేస్తాడనిపించింది. 13 ఓవర్లకు జట్టు స్కోరు 128 కాగా.. జైస్వాల్ 83రన్స్ చేశాడు. భారత్ విజయానికి 25 పరుగులు అవసరం కాగా.. యశస్వి సెంచరీ చేస్తాడనిపించింది. అయితే శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడి అర్ధ శతకం బాదాడు. దాంతో జైస్వాల్ సెంచరీ కోల్పోయాడు.