దేశ రాజధాని ఢిల్లీని భారీ వరదలు ముంచెత్తాయి. ఇటీవల కురిసిన వర్షాలతో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇప్పటికే ప్రమాదకర స్థాయిని దాటగా.. ప్రస్తుతం 207.41 మీటర్ల దగ్గర నీటి ప్రవాహం కొనసాగుతోంది.
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీపై ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో ఆప్ సంబంధాలు గురించి అడిగిన ప్రశ్నకు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ యమునా నది నీళ్లపై రాజకీయ దుమారం రేపింది. యమునా నీళ్లల్లో బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా ప్రభుత్వం విష ప్రయోగం చేసిందని మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో నీటి సరఫరాకు అంతరాయం కలిగించేందుకు హర్యానా యమునా నదిలో ‘‘విషం’’ కలుపుతోందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలకు రుజువులు ఇవ్వాలని ఎన్నికల సంఘం మంగళవారం కేజ్రీవాల్‌కి లేఖ రాసింది. బుధవారం రాత్రి 8 గంటల వరకు రుజువులు ఇవ్వాలని ఆదేశించింది.
Maha kumbh Mela 2025: గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం ప్రయాగ్ రాజ్.. మహా కుంభ మేళాకు రెడీ అయింది. నేటి (జనవరి 13) నుంచి ఈ ఆధ్యాత్మిక ఉత్సవం ప్రారంభం అయింది. పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమయ్యే ఈ మహా కుంభ్.. సుమారు 45 రోజుల పాటు జరగనుంది.
ఆగ్రాలోనూ యమునా తన భీకర రూపం దాల్చుతుంది. మరోవైపు యమునా నది నీటిమట్టంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే యమునా నీటి మట్టం అనేక ప్రాంతాలను తాకింది. యమునా నది నీరు కూడా తాజ్ మహల్ కాంప్లెక్స్ సరిహద్దు దగ్గరకు చేరుకుంది.
దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదు అన్నట్టుగా మారింది దేశ రాజధాని ఢిల్లీలోని వరదల పరిస్థితి. యమునా నది ప్రవాహం కొంత మేరకు తగ్గినప్పటికీ.. వర్షాలు తగ్గకపోవడంతో .. ఢిల్లీ ప్రజలు ఇంకా వరద నీటి నుంచి బయటికి రాలేకపోతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు యమునా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో నీటిమట్టం హెచ్చరిక స్థాయికి చేరుకుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పాత రైల్వే వంతెన వద్ద యమునా నీటిమట్టం 204.36 మీటర్లకు చేరుకుంది.