Maha Kumbh Mela 2025: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ నెల 13వ తేదీన ప్రారంభంకానున్న మాహా కుంభమేళాపై సర్వత్రా ఆసక్తి కొనసాగుతుంది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించాలని కోట్లాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు సుమారు 45 రోజుల పాటు ఈ మహా కుంభమేళా జరగబోతుంది. అయితే, ఈ కుంభమేళాలో ఆరు రోజులకు ప్రత్యేకతలు ఉన్నాయి.
Read Also: Syria: సిరియాలో గవర్నమెంట్ ఉద్యోగులకు 400 శాతం జీతాల పెంపు..
అయితే, ఈ కుంభమేళా సమయంలో పవిత్ర నదులలో స్నానం చేస్తే మోక్షం వస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ సమయంలోనే నదుల నీరు అమృతం లాగా స్వచ్ఛంగా మారుతుందని హిందువులు నమ్ముతారు. ఈ కుంభమేళా సమయంలో స్నానం చేయడంతో సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. ఇక, ఈ కుంభమేళాలో రాయల్ స్నానానికి ప్రత్యేకలు ఉన్నాయి.. గంగా, యమునా, సరస్వతి నదులు ప్రయాగ్‌రాజ్ లో కలుస్తాయి. కాబట్టి ఈ ప్రాంతానికి ప్రత్యేక మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. మత విశ్వాసాల ఆధారంగా ఇక్కడ స్నానం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.
Read Also: Srisailam Temple: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. పాదయాత్ర భక్తులకు ఈవో శుభవార్త!
కుంభమేళాలో ప్రత్యేకమైన రోజులు ఇవే..
* మొదటి రోజు స్నానం 13 జనవరి 2025న పుష్య పౌర్ణమి రోజున నిర్వహించనున్నారు.
* రెండో రోజు స్నానం మకర సంక్రాంతి 14 జనవరి 2025న చేస్తారు.
* మూడో రోజు స్నానం 2025 జనవరి 29న మౌని అమావాస్య రోజున చేయాలి.
* నాల్గవ రోజు స్నానం బసంత్ పంచమి, 3 ఫిబ్రవరి 2025న చేస్తారు.
* ఐదవ రోజు స్నానం మాఘ పూర్ణిమ, 12 ఫిబ్రవరి 2025 రోజున చేయాలి.
* ఇక, 2025 ఫిబ్రవరి 26న మహాశివరాత్రి నాటి చివరి రోజు స్నానం చేస్తారు.