యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద జోషి దర్శించుకున్నారు. ఆయనకు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో.. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేడు ప్రారంభం కానుంది. ఈయాత్ర ఐదు జిల్లాల్లోని 12 నియోజకవర్గాలను చుడుతూ, 328 కిలోమీటర్ల మేర.. 24 రోజుల పాటు బండి పాదయాత్ర చేయనున్నారు. పుణ్య క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించి, వంగపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభకు కేంద్రమంత్రులు గజేంద్ర షెకావత్, కిషన్ రెడ్డి ముఖ్య…
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం కావడంతో భక్తులతో కిక్కిరిసింది. పలు ప్రాంతాల నుంచి తరలిరావడంతో.. సర్వదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయానికి చేరుకున్నారు భక్తులు. ఈసందర్భంగా ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని తరించారు భక్తజనం. స్వామి వారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును ఎంతో భక్తితో చెల్లిచుకున్నారు. ఆలయంలోని కళాభవన్ లోని స్వామివారి నిత్య కల్యాణం, సత్యనారాయణ వ్రతం తదితర ఆర్జిత సేవలలో భక్తులు భక్తితో హాజరయ్యారు. భక్తులు వారి తలనీలాలు సమర్పించే భక్తులతో కల్యాణ…
నేటి నుంచి యాదాద్రిలో మూడు రోజులపాటు లక్ష్మీ నరసింహస్వామి జయంత్యుత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో గీత తెలిపారు. అనుబంధ పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంతోపాటు దబ్బగుంటపల్లిలోని యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. సంభోద్భవుడైన నరసింహస్వామి జయంత్యుత్సవాలకు శుభఘడియాలు వచ్చేస్తున్నాయి. ఈ సంబరం నిర్వహణకు ఆచార్య బృందం.. ఆలయ యంత్రాంగం సంసిద్ధమైందని తెలిపారు. పునర్ నిర్మితమైన పంచనారసింహుల దివ్యాలయంలో నారసింహుడి జయంత్యుత్సవాలు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు విష్వక్సేన ఆరాధనతో మొదలవుతాయని ఈవో గీత,…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్లు , పంటలు దెబ్బతిన్నాయన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ లోని ప్రధాన ఆలయమైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి పరిసరాలు కూడా వర్షపునీటితో దెబ్బతిన్నాయి. ప్రధానాలయ పరిసరాలు, క్యూలైన్లు వర్షం నీటితోపాటు లీకవుతున్న ప్రధానాలయం మండపాలకు మరమత్తులు మొదలు పెట్టారు. ఈ మేరకు ఆలయ అధికారులు వర్షం కారణంగా జరిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకొని పనులకు సిద్దమైనారు. సన్నిధిలో ఎక్కడెక్కడ వర్షపు నీరు చేరి మట్టి పేరుకపోయిందో…
యాదాద్రి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. గత ఏడాది హైదరాబాద్‌లో పడినట్లు వర్షం పడలేదు అలా పడి ఉంటే యాదగిరిగుట్ట గుడి కూడా కులి పోయేదంటూ అగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటల వర్షానికే క్యూ లైనులు, రోడ్లు, గుడికి ఎదురుగా చెరువు తయారు అయింది అంటే ఎనమిది ఏండ్లగా నువ్వు ఇరవై సార్లు వచ్చి ఏమి చేశావు ముఖ్యమంత్రి కేసీఆర్ అని వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. ఎవరా కాంట్రాక్టర్, సినిమా ఆర్ట్…