యాదాద్రికి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. రేపు యాదాద్రి పర్యటనకు వెళ్లనున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఉదయం 11.30 కు హైద్రాబాద్ నుండి బయలుదేరి వెళతారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు పూర్తి స్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నీటిని రేపటి పర్యటనలో మరోసారి సిఎం కెసిఆర్ పరిశీలిస్తారు. యాదాద్రి పున: ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామివారు నిర్ణయించి వున్నారు. ఇక రేపు యాదాద్రిలోనే ఆలయ పున: ప్రారంభం తేదీలను సిఎం కెసిఆర్ స్వయంగా ప్రకటిస్తారు. పున:…
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల జల వివాదాలు, కేంద్ర గెజిట్‌తో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధానితో చర్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి అధికారికంగా భవనం ఏర్పాటు స్థలాన్ని కేటాయించాలని మోడీని కేసీఆర్ కోరారు. ఈ అభ్యర్థనలకు ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి…
యాదాద్రి భువనగిరి జిల్లాలో రేపు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు బీబీ నగర్ ఎయిమ్స్ లో రేడియో డయగ్నోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 8:40 యాదాద్రిలక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం చేసుకుంటారు. 10:30 యాదగిరిగుట్టలో రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చ్ రాష్ట్ర కార్యవర్గం సర్వ సభ్య సమావేశంలో పాల్గొననున్నారు. కాగా, తెలంగాణలో బీజేపీని పటిష్టం చేసేందుకు బండి సంజయ్ కార్యాచరణ సిద్ధం చేశారు. ఈమేరకు ఆగస్టు…
యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దేశమే అశ్చర్యపోయేలా కేసీఆర్ ప్రభుత్వం… యాదాద్రి ఆలయాన్ని నిర్మిస్తోంది. అయితే.. యాదాద్రి ఆలయ పునర్మిర్మాణ పనులను సీఎం కేసీఆర్ సోమవారం పరిశీలించారు. అక్కడి నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్..పనులు త్వరగా పూర్తి కావాలని కూడా కీలక ఆదేశాలు ఇచ్చారు. అయితే… ఆ రోజున సీఎం కేసీఆర్ వెంటే ఉన్న రాజ్యసభ ఎంపీ, టీఆర్‌ఎస్ కీలక నేత సంతోష్ కుమార్… విద్యుత్ వెలుగుల్లో, వెన్నెల…
యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, 20 లక్షల మంది భక్తులు ఒకేసారి వచ్చినా సరిపోయే విధంగా అన్ని సౌకర్యాలు ఉండేలా ఆలయ నిర్మాణ పనులు జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర రావు అధికారులను ఆదేశించారు. కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చిన నేపథ్యంలో పనులను వేగంగా పూర్తి చేయాలని అన్ని రకాల పనులను సమాంతరంగా కొనసాగించాలని సూచించారు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి యాదాద్రిని సందర్శించారు. తొలుత ఆలయ రింగ్ రోడ్ చుట్టూ పర్యటించి…
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రికి చేరుకున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనార్థం మంగళవారం యాదాద్రికి చేరుకున్నారు జస్టిస్ ఎన్.వి రమణ. ఈ సందర్బంగా యాదాద్రి కొండపై కొత్తగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహం వద్ద ఎన్వీ రమణకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అలాగే ఆలయ అర్చకులు సీజేఐ దంపతులకు పూర్ణకుంభంతో…