ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి ఆలయ ‘విమాన గోపురం’కు బంగారు తాపడం కోసం కిలో 16 తులాల బంగారాన్ని సమర్పించనున్నారు. సీఎం కేసీఆర్ ఉదయం 11.30 గంటలకు రోడ్డు మార్గంలో యాదాద్రికి చేరుకుని ఆలయంలో పూజల్లో పాల్గొంటారు. తన కుటుంబం తరపున ‘విమాన గోపురం’ బంగారు తాపడం కోసం ఒక కిలో 16 తులాల బంగారాన్ని సమర్పించనున్నారు. ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండ మందిరంలోని ప్రస్తుత బాలాలయం ఆవరణలో ‘కళా వేదిక’కి కూడా సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు.
అనంతరం ఆలయ అధికారులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ అధికారులు. అయితే.. సీఎం కేసీఆర్ చివరిసారిగా ఏప్రిల్‌లో యాదాద్రికి వెళ్లి అక్కడ శివాలయం పునఃప్రారంభంలో పాల్గొన్నారు.