యాదాద్రి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. గత ఏడాది హైదరాబాద్‌లో పడినట్లు వర్షం పడలేదు అలా పడి ఉంటే యాదగిరిగుట్ట గుడి కూడా కులి పోయేదంటూ అగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటల వర్షానికే క్యూ లైనులు, రోడ్లు, గుడికి ఎదురుగా చెరువు తయారు అయింది అంటే ఎనమిది ఏండ్లగా నువ్వు ఇరవై సార్లు వచ్చి ఏమి చేశావు ముఖ్యమంత్రి కేసీఆర్ అని వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. ఎవరా కాంట్రాక్టర్, సినిమా ఆర్ట్ డైరెక్టర్‌కి పని అప్పగించి మంచి యాదగిరిగుట్టను 2 వేల కోట్ల రూపాయలతో నాశనం చేశావ్ అంటూ ఆయన ఆరోపించారు. యాదాద్రి పనులపైన సీబీసీఐడీ తో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ కాంట్రాక్టర్లు ఎవరు.. దాంట్లో దోచుకుంది ఎవరు, నాణ్యత మీద కూడా విజిలెన్స్ విచారణ జరిపించాలన్నారు.
ముఖ్యమంత్రి, విజిలెన్స్ వాళ్లకు లెటర్ రాస్తానని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారు వెంటనే వచ్చిన యాదాద్రి పరిశీలించండి అంటూ ఆయన ధ్వజమెత్తారు. ఈవో గీతారెడ్డి ఇష్టానుసారంగా నామినేషన్ మీద పనులు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పరువు తీసిందని ఆయన మండిపడ్డారు.. ఈఓ గీత రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం లేదన్నారు. హరీష్ రావుకు మంత్రి పదవి కాంగ్రెస్ పుణ్యాన్న వచ్చిందని, అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సోనియాగాంధీ పుణ్యనా తెలంగాణ రాష్ట్ర వచ్చింది ఆమె స్థానంలో ఎవరు ఉన్న తెలంగాణ రాదు అని కేసీఆర్ చెప్పలేదా.. తెలంగాణ రాష్ట్రంలో తిరగడానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి హక్కు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.