బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో.. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేడు ప్రారంభం కానుంది. ఈయాత్ర ఐదు జిల్లాల్లోని 12 నియోజకవర్గాలను చుడుతూ, 328 కిలోమీటర్ల మేర.. 24 రోజుల పాటు బండి పాదయాత్ర చేయనున్నారు. పుణ్య క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించి, వంగపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభకు కేంద్రమంత్రులు గజేంద్ర షెకావత్, కిషన్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రిలో ప్రారంభమై వరంగల్‌లోని భద్రకాళి ఆలయం వరకు కొనసాగనుంది. ఈసారి చారిత్రక, తెలంగాణ సాయుధ, ఉద్యమ పోరాటాల నేపథ్య ప్రాంతాల మీదుగా బండి సంజయ్ పాదయాత్ర సాగనుంది.
read also: CM KCR on Independance Day: నేడు ప్రగతిభవన్ లో సీఎం సమావేశం.. వజ్రోత్సవాలపై చర్చ
కాగా.. జనం గోస వినడం.. ప్రజలకు భరోసా ఇవ్వడంతో పాటు తెలంగాణలో రాబోయేది భాజపా సర్కారేననే సంకేతాలు పంపడమే ఈయాత్ర లక్ష్యంగా బండి ముందుకు వెళ్లనున్నారు. అయితే.. మరోవైపు ఈ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో శ్రేణులు నిమగ్నమయ్యాయి. ఈయాత్ర ప్రజా సంగ్రామ యాత్ర మొత్తం 24 రోజులపాటు సాగనుంది. యాత్ర యాదాద్రి భువనగిరి, నల్గొండ, జనగాం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్, జనగాం, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసుకుంటూ.. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వెళ్లనున్నారు. ఈ నెల 26న భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగియనుంది. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా.. ఆర్ట్స్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Ayman al-Zawahiri: అల్‌ఖైదా చీఫ్ హతం.. ధృవీకరించిన అమెరికా అధికారి