Bandi Sanjay: యాదాద్రిని కాదు.. మీ నోటిని యాసిడ్ తో కడగాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. మునుగోడులో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ కి చెందిన 16 మంది మంత్రులకు డ్రగ్స్ టెస్ట్ చేయించాలన్నారు. కేటీఆర్ పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువు అంటే అర్థం తెలుసా. నువ్వు నీ అయ్యను కొడతావు.. డ్రగ్స్ తీసుకొని నువ్వు, మందు తాగి నీ అయ్య సోయి లేకుండా ఏమి చేస్తున్నారో మీకు తెలియదు…చెప్పులు గురువులకు అందిస్తాం… గురు శిష్యుల బంధం అది అన్నారు.
గుడిని ఎందుకు సంప్రోక్షణ చేయాలన్నారు. మీది మీ అయ్యది నోరు యాసిడ్ తో సంప్రోక్షణ చేయాలని ఎద్దేవా చేశారు. ఆ గుడి చాలా పవర్ ఫుల్… తప్పు చేసిన వాడు ఎవ్వడు ఆ గుడికి తడి బట్టలతో వెళ్ళడన్నారు బండి సంజయ్. నీవు నాస్తికుడివు కదా… దేవుణ్ణి నమ్మవు కదా.. మిమ్మల్ని గద్దె దించి తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేస్తాం…అయ్యా కొడుకులు నోరు హద్దుల్లో పెట్టుకోవాలి…నీ ఎమ్మేల్యేలు తప్పు చేయక పోతే ప్రగతి భవన్ లో ఎందుకు పెట్టుకున్నావన్నారు బండి సంజయ్. 16 మంది మంత్రులు ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకుంటారు… అధికారంలోకి రాగానే వారికి టెస్ట్ లు చేస్తాం… కెసిఆర్ కుటుంబ సభ్యులతో సహా అన్నారు. కృష్ణ జలాల విషయంలో ఈ ప్రాంతానికి అన్యాయం చేసిందే కెసిఆర్. ఏపీ సీఎంతో లాలూచీ పడి మనకు రావాల్సిన నికరజలాలను వదులుకున్నారన్నారు.
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
Read Also: Hari Hara Veeramallu: రంగంలోకి మరో బాలీవుడ్ స్టార్.. కానీ?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి దొంగ ఓటు వేశారని ఆరోపణలున్నాయి.. దేవుడి ముందు వారు ప్రమాణం చేయాలి.. కర్నాటకలో రోహిత్ రెడ్డి మీద డ్రగ్స్ కేసు ఉందన్నారు బీజేపీ ఇన్ ఛార్జి తరుణ్ చుగ్. మునుగోడులోని చండూరు రోడ్డులో మునుగోడు నియోజకవర్గ దళిత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరయ్యారు తరుణ్ చుగ్, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, బండి సంజయ్ ,వివేక్ వెంకట స్వామి, గంగిడి మనోహర్ రెడ్డి,బోడిగే శోభ, బాబూమోహన్, మాజీ మంత్రి చంద్రశేఖర్, విజయ రామారావు, కర్ణాటక కోలార్ ఎంపీ మునుస్వామి.
Read Also: Pawan Kalyan: ‘అలీతో సరదాగా’ టాక్ షోకు గెస్టుగా పవర్‌స్టార్.. ఇది నిజమేనా?
తాజావార్తలు
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!