పాలకులు ఏదైనా మంచి పని చేస్తే అది కొన్నేళ్ల పాటు ప్రజలకు గుర్తుండిపోవాలి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసిన యాదాద్రి ఆలయ పునరుద్ధరణ అలాంటిదే. గుట్టపై నూతనంగా వెలసిన ఆలయ నిర్మాణాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ మహాకార్యాన్ని నిజం చేసిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు కూడా జన హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇప్పుడు యాదాద్రి అందాలను చూస్తే మైమరచిపోకుండా ఉండలేరు. అంత రమ్యంగా తీర్చిదిద్దారు యాదగిరి నరసింహుని సన్నిధిని. ఎక్కడా రాజీ…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి ఆలయం భక్తులకు దర్శనమిచ్చేందుకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ మహాక్రతువు ప్రారంభమైంది. విశ్వక్సేనుడి తొలిపూజ స్వస్తి పుణ్యహ వాచన మంత్రాలతో స్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటన మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ చేశారు. బాలాలయంలో పంచకుండాత్మక యాగం కోసం యాగశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా వెదురు కర్రలతో యాగశాలను నిర్మించారు. అయితే మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా స్వామి వారికి అభిషేకానికి…
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. 1200కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2016 అక్టోబర్ 11 దసరా రోజున ప్రారంభమైన పనులు ఐదేళ్లలోనే పూర్తయ్యాయి. ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా తలపెట్టిన శ్రీసుదర్శన నారసింహ మహాయాగం వాయిదాపడినట్టు తెలుస్తోంది. వచ్చే నెల 21 నుంచి మహాయాగాన్ని నిర్వహించాలని ముందుగా నిర్ణయం తీసుకున్నారు. ఆలయాభివృద్ధిలో భాగంగా చేపట్టిన కట్టడాలు పూర్తికాకపోవడంతో నారసింహ మహాయాగాన్ని వాయిదా వేశారు. ఆలయ ఉద్ఘాటన తర్వాత కార్యక్రమం నిర్వహణ వుంటుందని అంటున్నారు.…
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. నరసింహస్వామి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో రావటంతో ఆలయ తిరువీధులు, దర్శన క్యూలైన్లు, సేవా మండపాలు భక్తులతో నిండిపపోయాయి. ధర్మదర్శనాలకు మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామికి నిత్యారాధనలు సంప్రదాయ పద్దతిలో కొనసాగాయి. Read Also: ఎమ్మెల్సీ కడియంను కలిసిన ఎమ్మెల్యే అరూరి రమేష్ వేకువజామున సుప్రభాతంతో ఆరంభమైన నిత్యవిధి కైంకర్యాలు రాత్రివేళ శయనోత్సవాలతో ముగిశాయి. బాలాలయంలో కవచమూర్తులను…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పునఃనిర్మించ తలపెట్టిన యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణం పూర్తైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రి సీఎం కేసీఆర్ ముచ్చింతల్‌లో ఉన్న చినజీయర్ స్వామిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మహాకుంభ సంప్రోక్షణ, మహా సుదర్శన యాగం లాంటి ఏర్పాట్లపై చినజీయర్‌తో చర్చించనున్నారు. అంతేకాకుండా రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై కూడా సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. అయితే ఎప్పుడెప్పుడా అని యావత్తు తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్న యాదాద్రి ఆలయం…
నల్లగొండ జిల్లాలో టీహబ్, టాస్క్ సెంటర్‌ను మంజూరు చేస్తామని రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జిల్లాలోని పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలోని నూతన ఎస్సీ, ఎస్టీ హస్టల్ భవనాలను ప్రారంభించి. టీహబ్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. నల్లగొండకు ఐటీ హబ్ కేసీఆర్ వల్లనే సాకరమైందన్నారు. హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీని రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌దేనన్నారు. ఐటీ సాంకేతిక ఫలాలు సామాన్యులకు అందాలనేదే సీఎం కేసీఆర్‌లక్ష్యమన్నారు. వరంగల్,…
నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమా విడుదలై 25 రోజులైనా, తరువాత మరో రెండు భారీ చిత్రాలు విడుదలైనా ‘అఖండ’ జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. ‘అఖండ’ చిత్రం భారీ విజయం సాధించడంతో చిత్రబృందం చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విజయోత్సవాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి వరుసగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు బాలయ్య. తాజాగా ఆయన ‘అఖండ’ టీంతో కలిసి తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిని దర్శించారు. అంతేకాదు ఆయన యాదాద్రి విషయమై సీఎం…
శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. బాలాలయం వద్ద భక్తులతో క్యూ లైన్లు కిక్కిరిసిపోవడంతో భక్తులకు సాధారణ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. తెల్లవారుజామున 4 గంటలకు బాలాలయంలోని శ్రీ లక్ష్మీనృసింహ స్వామి వారికి ఆర్జిత సేవలు నిర్వహించారు. బాలాలయంలో ఆలయ అర్చకులు నిజాభిషేకం, సుదర్శన మహా హోమం నిర్వహించారు. గుట్టపైన ఉన్న పాత గోశాలలోని వ్రత మండపంలో జరిగిన శ్రీ సత్యనారాయణ స్వామి…