టీమిండియా బ్యాటర్లను ఇబ్బందిపెట్టేందుకు ఆసీస్ ప్రణాళికలు రచించుకున్నారు. అందుకు సంబంధించి ఆసీస్.. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో ఫైనల్ బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ చెప్పాడు. ఇక ఈ ముగ్గురిలో తనతో పాటు, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలండ్ ఉన్నారని తెలిపాడు.
ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ రేపు(బుధవారం) ప్రారంభం కానుంది. లండన్ లోని ఓవల్ మైదానంలో ఛాంపియన్ షిప్ కోసం టీమిండియా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. వరుసగా రెండోసారి టెస్ట్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కు వచ్చిన భారత్.. ఈసారైనా కప్ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంది.
పోర్ట్స్ మౌత్‌లోని అరుండెల్ మైదానంలో టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. నెట్ ప్రాక్టీస్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌పైనే కాకుండా ఫీల్డింగ్‌పై కూడా రోహిత్ సేన నజర్ పెట్టింది. ఈ క్రమంలో రంగు రంగుల రబ్బరు బంతులతో భారత జట్టు క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తోంది.
డబ్ల్యూటీసీకి సంబంధించి పలువురు మాజీలు క్రికెటర్లు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అటు ఆసీస్ మాజీ కెప్టెన్ రిక్కీ పాంటిగ్ చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ గురించి అసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కు ముందు టీమిండియాకు గాయాలే కాదు మంచి కూడా జరుగుతుంది. ఇంగ్లాండ్ లోనే ఉన్న టీమిండియా టాపార్డర్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా మరో శతకం బాదాడు. ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న పుజారా.. సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఈ సీజన్ లో నాలుగో మ్యాచ్ ఆడుతున్న పుజారా.. మూడు సెంచ�
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే భారత టీమ్ మిడిలార్డర్ చాలా బలహీనంగా మారింది. రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికే గాయాలతో జట్టుకు దూరమయ్యారు. తాజాగా కేఎల్ రాహుల్ కూడా ఈ మ్యాచ్ ఆడటం లేదని ప్రకటించాడు. దీంతో అతను కూడా తొడకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని వెల్లడించాడు. ఈ క్రమంలో సీనియర్ వికెట్ కీపర�
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక సూచన చేశాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రెడీ అయ్యేందుకు రోహిత్ శర్మ ఐపీఎల్ నుంచి బ్రేక్ తీసుకోవాలని వెల్లడించారు.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఫలితం తేలకముందే న్యూజిలాండ్ టీమిండియా గుడ్‌న్యూస్‌ను అందించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో భారత్‌తో పోటీపడిన శ్రీలంకను ఓడించి.. రోహిత్ సేనకు మార్గం సుగమం చేసింది.
న్యూజిలాండ్‌లో న్యూజిలాండ్ జట్టును ఓడించే సత్తా శ్రీలంకకు లేదని మాజీ క్రికెటర్ సంజయ్ ముంజ్రేకర్ అన్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సిప్ ఫైనల్ కోసం ఇండియా, శ్రీలంక మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో సంజయ్ ముంజ్రేకర్ ఈ విధంగా రియాక్ట్ అయ్యారు.