WTC FINAL 2023: భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో మొదట ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లు రఫ్పాడించారు. స్టీవెన్ స్మిత్(121), ట్రెవిస్ హెడ్(163) పరుగులు చేసి సెంచరీలతో అదరగొట్టారు. ఇక వార్నర్ (43) పరుగులు, వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ (48) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 469 పరుగులు చేశారు.
Read Also: Madhya Pradesh: ఫలించని శ్రమ.. 300 అడుగుల లోతు బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి మృతి
ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 469 పరుగులు చేసి.. టీమిండియాకు భారీ ఆధిక్యాన్ని ముందుంచుంది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ దిగిన టీమిండియా ఓపెనర్స్ రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. రోహిత్ శర్మ (15), గిల్ (13) పరుగులు చేసి ఔటయ్యారు. దీంతో భారత్ కష్టాల్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన చటేశ్వర్ పుజారా.. కింగ్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.
Read Also: S Jaishankar: పాకిస్తాన్‌కు అర్థం చేసుకునే తెలివి లేదు.. అఖండ భారత్ చిత్రంపై జైశంకర్..
ఆసీస్ బౌలర్లకు మొదటి నుంచి టార్గెట్ వీరిద్దరే.. పుజారా, కోహ్లీని ఔట్ చేస్తే సగం ఒత్తిడి తగ్గుందంటున్నారు. మ్యాచ్ ప్రారంభం నుంచి వీరిపైనే చర్చలు నడిచాయి. వారిని ఎంత త్వరగా పెవిలియన్ బాట పట్టిస్తే.. అంత తక్కువ స్కోరుకే భారత్ ను కట్టడి చేయవచ్చని ఆస్ట్రేలియా క్రికెటర్లు అన్నారు. అందుకు తగ్గట్టుగానే వారికి ఆసీస్ బౌలర్లు బౌలింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉంచితే కోహ్లీ( 4 ), పుజారా (3) పరుగులతో ప్రస్తుతానికి క్రీజులో ఉన్నారు. టీ విరామ సమయానికి భారత్.. 10 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. వీరు ఎంతసేపు క్రీజులో ఉంటే అంత మంచిదని పలువురు క్రికెట్ అభిమానులు అంటున్నారు. చూడాలీ మరి వీరు ఎలా రానిస్తారో..