India Won The Toss And Chose To Field: లండన్‌లోని ఓవల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే! ఈరోజు నుంచి ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఈ మ్యాచ్‌లో.. టీమిండియా టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. హోరాహోరీగా సాగనున్న ఈ పోరులో, ఎవరు గెలుస్తారన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇంతకుముందు కూడా టీమిండియా ఫైనల్స్‌కు వెళ్లింది కానీ, న్యూజీలాండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. ఆ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు విఫలమవ్వడంతో, కివీస్ జట్టు భారత్‌పై సునాయాసంగా విజయం సాధించింది.
Monsoon: జూన్ 9న కేరళలోకి రుతుపవనాలు.. బిపోర్జాయ్ తుఫాన్ ప్రభావం..
ఈసారి మాత్రం భారత్ అలా చేజార్చుకోకూడదన్న పట్టుదలతో రంగంలోకి దిగింది. మొదటిసారి జరిగిన తప్పు మళ్లీ రిపీట్ అవ్వకుండా, ఆస్ట్రేలియాపై నెగ్గి ట్రోఫీ సొంతం చేసుకోవాలని కసి మీద ఉంది. అటు.. ఆస్ట్రేలియా సైతం ట్రోఫీ తప్పకుండా కొట్టాలన్న పంతంతో బరిలోకి దిగింది. క్రితంసారి ఫైనల్‌కి రాకుండానే తట్టాబుట్టా సర్దేసిన కంగారులు, ఈసారి ఎంతో కష్టపడి ఫైనల్ దాకా చేరుకున్నారు. ఇక్కడిదాకా వచ్చినప్పుడు, ఎలాగైనా కప్పు కొట్టాలన్న సంకల్పంతో వాళ్లు ఉన్నారు. అయితే.. ఓవల్‌లో ఆస్ట్రేలియాతో పోలిస్తే, భారత్‌కి మంచి రికార్డ్ ఉంది. ఒకరకంగా ఇది భారత్‌కి కలిసొచ్చే అంశమే! మరి, ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారన్నది వేచి చూడాలి.
Health Tips: బీట్ రూట్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.. ముఖ్యంగా దానికి..!
కాగా.. జట్టులో టీమిండియా నలుగురు పేసర్లకు చోటు కలిపించింది. అశ్విన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి రాగా.. వికెట్ కీపర్ భరత్, రహానే తుదిజట్టులో చోటు దక్కించుకున్నారు. అటు ఆసీస్ కూడా నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతుంది. గ్రీన్, కమిన్స్, స్టార్క్, బోలండ్ తుది జట్టులో ఉండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా నాథన్ లియోన్‌ను ఆసీస్ బరిలోకి దించింది.
టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖ్వాజా, డేవిడ్ వార్నర్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ (వికెట్‌కీపర్), పాట్ కమిన్స్, నాథన్ లియోన్, స్కాట్ బోలండ్, మిచెల్ స్టార్క్