టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ విమర్శల వర్షం కురింపించాడు. ఈ కీలక మ్యాచ్ లో ద్రివిడ్ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడని అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అజింక్యా రహానే 92 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. అయితే లక్కీగా రెండుసార్లు నో బాల్స్ కావడంతో.. రెండు వికెట్లు మిగిలి ఉన్నాయని చెప్పవచ్చు. దీంతో నో బాల్స్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి.
కోహ్లీ ప్రదర్శనపై క్రికెట్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో ఆయనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కోహ్లీ ఔటైన వెంటనే తన జట్టు సభ్యులతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో భోజనం చేస్తున్న ఫోటోను షేర్ చేసుకోవడం అభిమానులకు అస్సలు నిద్రపట్టడం లేదు. టెస్టుల్లో అతని కమ్ బ్యాక్ గురించి కళ్లు కాయలు కాచే�
ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 469 పరుగులు చేసి.. టీమిండియాకు భారీ ఆధిక్యాన్ని ముందుంచుంది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ దిగిన టీమిండియా ఓపెనర్స్ రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. రోహిత్ శర్మ (15), గిల్ (13) పరుగులు చేసి ఔటయ్యారు. దీంతో భారత్ కష్టాల్లోకి వెళ్లిపోయింది.
భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా బ్యాటర్లు దుమ్ములేపుతున్నారు. భారీ స్కోరు మీద కన్నేసిన ఆసీస్.. ఫస్ట్ డే 327-3 వద్ద ఆట ముగియగా.. రెండో రోజు ఆట ఆరంభించి అదే దూకుడు ప్రదర్శన కొనసాగిస్తున్నారు.
ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో తొలిరోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. తొలి సెషన్ నుంచి నిలకడగా ఆడిన ఆస్ట్రేలియా ఫస్ట్ రోజే 300 పరుగులు మార్క్ దాటి భారీ స్కోరుపై కన్నేసింది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ సిరాజ్ మియా.. ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. మ్యాచ్ ఆరంభంలోనే ఒక వికెట్ తీసి శుభారంభాన్ని అందించిన సిరాజ్.. ఆసీస్ బ్యాటర్లను హడలెత్తిస్తున్నాడు.
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ విజయం సాధిస్తే సెలబ్రేట్ చేసుకునేందుకు తాను సిద్దంగా ఉన్నాని గ్రేమ్ స్వాన్ అన్నాడు. ఓవల్ మైదానంలో ఇవాళ్టి నుంచి మ్యాచ్ జరగుతుంది.. కాబట్టి పిచ్ చాలా ఫ్లాట్గా ఉంటుందని.. పేసర్లకు అనుకూలిస్తుందని స్వాన్ అభిప్రాయపడ్డాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత భారత్-ఆస్ట్రేలియా జట్లు మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఇవాళ ఆడుతున్నాయి. మార్చి తర్వాత రెండు నెలల పాటు ఐపీఎల్-16 బిజీలో గడిపిన ఇరు దేశాల క్రికెటర్లు ఇప్పుడు ముఖాముఖి తలపడబోతున్నారు.