బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత భారత్-ఆస్ట్రేలియా జట్లు మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఇవాళ ఆడుతున్నాయి. మార్చి తర్వాత రెండు నెలల పాటు ఐపీఎల్-16 బిజీలో గడిపిన ఇరు దేశాల క్రికెటర్లు ఇప్పుడు ముఖాముఖి తలపడబోతున్నారు. ఐసీసీ రెండేండ్లకోసారి నిర్వహించే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ నేటి నుంచి జరుగనుంది. ఈ మేరకు ఇంగ్లాండ్ లోని ‘ఓవల్’ మైదానం సిద్ధమైంది. మరి ఓవల్‌లో స్టేడియంలో ట్రోఫీ అందుకునేది ఎవరు..? అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
Read Also: Prabhas: తిరుపతిలోనే నా పెళ్లి.. కృతిని చూసాక..
రెండేండ్లకోమారు జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భాగంగా టాప్ – 2లో నిలిచిన టీమ్స్ తుదిపోరులో తలపడతాయి. ఈ రెండేండ్లలో ఆస్ట్రేలియా 19 మ్యాచ్ లు ఆడి 11 గెలిచి మూడు ఓడి, ఐదింటిని డ్రా చేసుకుని 152 పాయింట్స్‌తో తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఉన్న టీమిండియా.. 18 టెస్టుల్లో పది గెలిచి ఐదు ఓడి మూడింటిని డ్రా చేసుకుని 127 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది.
Read Also: Om Raut: హనుమంతుడి కోసం ప్రతి థియేటర్‌లో ఒక సీటు..
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టుకు బ్యాటింగే అతిపెద్ద బలం. గడిచిన ఆరు నెలలుగా టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్‌తో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలు పరుగుల వరద పారిస్తున్నారు. ఐపీఎల్‌లో విఫలమైనా రోహిత్ శర్మ టెస్టులలో మంచి టచ్ లోనే కనిపిస్తున్నాడు. 2021లో ఇదే వేదికలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో రోహిత్ సెంచరీ చేశాడు. అయితే మరోవైపు పుజారా కూడా కౌంటీ ఛాంపియన్‌షిప్ లో మూడు సెంచరీలు కొట్టి వచ్చాడు. సుమారు ఏడాదిన్నర తర్వాత టీమిండియాలో స్థానం సంపాదించుకున్న అజింక్యా రహానే ఐపీఎల్ లో మెరుగైన ప్రదర్శన చేశాడు.
Read Also: Ponguleti, Jupalli: కాంగ్రెస్ గూటికి పొంగులేటి, జూపల్లి!.. ఈ నెల 20 లేదా 25న ఖమ్మం సభలో చేరిక
వికెట్ కీపర్‌గా ఇషాన్ – భరత్‌ల మధ్య ఎవరిని ఎంచుకుంటారనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. బ్యాటింగ్ బలంగా ఉన్నా టీమిండియాకు బౌలింగ్ కీలకం.. ఈ మ్యాచ్ లో గెలిచినా ఓడినా అది భారత్ బౌలర్ల మీదే ఆధారపడి ఉంది. డ్రై వికెట్ అయిన ఓవల్ మొదటి మూడు రోజులు బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుంది. మరి ఈ బౌన్సీ పిచ్ పై షమీ, సిరాజ్ లతో పాటు మూడో పేసర్ గా ఎవరిని తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. శార్దూల్, ఉమేశ్ లలో ఎవరిని ఎంచుకుంటారనేదానిపై టీమిండియా పేస్ బలం ఆధారపడి ఉంది. స్పిన్నర్లలో రవీంద్ర జడేజా-అశ్విన్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. అక్షర్ పటేల్ ను బెంచ్ కే పరిమితం చేసే ఛాన్స్ ఉంది.
Read Also: Sharad Pawar: కొత్త పార్లమెంట్ నిర్మించాల్సిన అవసరం ఏమిటో అర్థం కాలేదు..
డబ్ల్యూటీసీలో భాగంగా వరుస విజయాలతో ఆస్ట్రేలియా జోరుమీదుంది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఓడిపోయినా ఆసీస్ ను మాత్రం మనం తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఓవల్ పిచ్ కూడా ఆస్ట్రేలియా కండిషన్స్‌కకు సరిపోయేలా ఉండటం కంగారూ జట్టకు కలిసొచ్చే అంశం. ఆ జట్టులో కూడా ప్రమాదకరమైన ఆటగాళ్లకు కొదవలేదు. ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, ట్రావిస్ హెడ్, అలెక్స్ కేరీ రూపంలో ఆ జట్టుకు స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ తో పాటు.. యువ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా ఉన్నాడు.
Read Also: Chinna Jeeyar Swamy: ప్రభాస్ లోకానికి మహోపకారం చేశాడు..
హెజిల్‌వుడ్ గాయంతో దూరమైనా మిచెల్ స్టార్క్, స్కాట్ బొలాండ్ తో పాటు కెప్టెన్ పాట్ కమిన్స్ లు ఓవల్ లో టీమిండియా బ్యాటర్ల పని పట్టడానికి ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు. గ్రీన్ కూడా మీడియం పేసర్ కావడంతో ఆ జట్టుకు నాలుగో పేసర్ కూడా దొరికాడు. స్పిన్నర్లలో లియాన్ డేంజరస్ బౌలర్ గా మారే అవకాశం ఉంది.
Read Also: Adipurush Final Trailer: పాపం ఎంత బలమైనది అయినా అంతిమ విజయం సత్యానిదే
అయితే ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంది. వర్షం అంతరాయం కలిగిస్తే.. కోల్పోయిన సమయాన్ని మిగిలిన రోజులతో పాటు రిజర్వ్ డే (జూన్ 12)న ఆడిస్తారు. ఒకవేళ వర్షం కారణంగా రోజు మొత్తం తుడిచిపెట్టుకుపోతే రిజర్వ్ డే రోజు ఆడిస్తారు. మ్యాచ్ ఐదో రోజు ముగిసేనాటికి మ్యాచ్ టై అయినా, డ్రా అయినా ఇరు జట్లనూ విజేతలుగా ప్రకటిస్తారు. ఈ మ్యాచ్ భారత కాలమానం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
Read Also: Minister Vidadala Rajini: ఏపీలో కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభానికి రంగం సిద్ధం
ఇరు జట్లు :
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కెఎస్ భరత్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్ ఉన్నారు.
స్టాండ్ బై ఆటగాళ్లు : యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, ముకేష్ కుమార్
Read Also: Adipurush Pre Release Event Live Updates : ప్రభాస్ ఫ్యాన్స్‌తో కిక్కిరిసిన తారకరామ స్టేడియం
ఆస్ట్రేలియా జట్టు : పాట్ కమిన్స్ (కెప్టెన్), అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, ట్రావిస్ హెడ్, మైకెల్ నెసెర్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, నాథన్ లియాన్, టాడ్ మర్ఫీ, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్, స్కాట్ బొలాండ్,
స్టాండ్ బై ఆటగాళ్లు : మిచెల్ మార్ష్, మాథ్యూ రెన్షా