WTC Final: ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ రేపు(బుధవారం) ప్రారంభం కానుంది. లండన్ లోని ఓవల్ మైదానంలో ఛాంపియన్ షిప్ కోసం టీమిండియా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. వరుసగా రెండోసారి టెస్ట్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కు వచ్చిన భారత్.. ఈసారైనా కప్ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. అలా అని కంగారులు మాత్రం ఏ తక్కువేం కాదు. వారు బ్యాటింగ్, బౌలింగ్ లోనూ బలంగా కనిపిస్తున్నారు. ఇంతకీ భారత్ తరుఫున బలాలు, బలహీనతలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ అనగానే భారత బ్యాటర్లకు, కంగారుల బౌలర్లకు మధ్య పోటీ ఉంటుంది. అయితే 2021 లో బ్యాటింగ్ ను నమ్ముకున్న భారత్.. ఒత్తిడికి నిలబడలేక టీమ్ ఇండియా బ్యాటర్లు విఫలమయ్యారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ మొదటిసారి నిర్వహించిన ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ తో తలపడగా.. కివీస్ కప్పును ఎగరేసుకుని పోయింది. ఆ మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా.. బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ కూడా బలంగా ఉంది. దీంతో టెస్ట్ ఛాంపియన్ షిప్ ట్రోఫీ భారత్ వశం అవుతుందని అందరు అనుకున్నప్పటికీ.. బ్యాటింగ్ వైఫల్యంతో కివీస్ పై ఓటమి పాలయ్యారు. ఐతే ఈసారి జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని మెరుగైన ప్రదర్శన చేయాలన్న కసితో భారత జట్టు కనిపిస్తోంది. టీమ్ లో సీనియర్లు, స్టార్ బ్యాటర్లు, యువ క్రికెటర్లు ఉన్నారు. అన్ని రంగాల్లోనూ టీమ్ ఫర్ ఫెక్ట్ గా ఉండటంతో ఈసారైనా.. కప్ చేజిక్కించుకోవాలని భారత జట్టు భావిస్తోంది.
Read Also: NCB: పాన్-ఇండియా డ్రగ్ నెట్‌వర్క్‌ను ఛేదించిన ఎన్సీబీ.. వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
2021 డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ, గిల్, పుజారా, విరాట్ కోహ్లీ, అజంక్య రహానే, పంత్, జడేజా, అశ్విన్ తో కూడిన బ్యాటింగ్ ఆర్డర్ బరిలో దిగింది. ఈసారి పంత్ మినహా మిగతా ఆటగాళ్లు అందరూ జట్టులో ఉన్నారు. ఇప్పుడు మన బ్యాటింగ్ విభాగాన్ని చూస్తే కొంత అయోమయంగానే కనిపిస్తోంది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, పంత్ దూరం అవడం జట్టుకు పెద్ద దెబ్బగానే భావించాలి. అది కాకుండా గతంలో లాగే ఇప్పుడు కూడా ఆటగాళ్లు ఐపిఎల్ ఆడి వచ్చారు. ఈ లీగ్ లో ఆట వేరు. ఇక్కడ నిరంతరంగా మ్యాచులు ఆడి ఆటగాళ్లు అలసిపోతారు. ఇప్పుడు డబ్ల్యూటిసి ఫైనల్ కు తగ్గట్టుగా ఆటతీరు మార్చుకోవాల్సి ఉంటుంది. సుదీర్ఘ ఫార్మాట్ కు అనుగుణంగా ఆటలో సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు అదే ఇంగ్లాండులోని కఠిన పరిస్థితుల్లో కంగారు బౌలర్ల సవాల్ ను దాటి మన బ్యాటర్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారన్నది కీలకంగా మారింది.
Read Also: SSMB29: మహేష్ సరసన దీపికా.. విలన్ గా అమీర్ ఖాన్ ..?
మరోవైపు డబ్ల్యూటీసి ఫైనల్లో పుజారా, కోహ్లీలతోనే ఆస్ట్రేలియాకు ప్రమాదమే అని ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. పుజారా, కోహ్లీ క్రీజులో ఉన్నంత సేపు ప్రత్యర్థికి సవాళ్లే. ఐపీఎల్ లో కింగ్ కోహ్లీ ఆడిన ఫామ్ ను బట్టి.. అంచనాలను పెంచే విధంగా ఉంది. మరోవైపు డబ్ల్యూటీసి సైకిల్లో భారత తరఫున బ్యాటింగ్ లో ఉత్తమ ప్రదర్శన చేసిన తొలి ఇద్దరు ఆటగాళ్లు పుజారా(887), కోహ్లీ (869) పరుగులతో ముందంజలో ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా అంటే చాలు పుజారా పరుగులు వేటలో ముందుంటాడు. ఇప్పటి వరకు ఆ జట్టుపై 24 టెస్టుల్లో 2033 పరుగులు సాధించాడు. మరోవైపు చివరగా ఆడిన టెస్టు (అహ్మదాబాద్) లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 186 పరుగులు చేసిన కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్లో మూడు ఏళ్ల శతక నిరీక్షణకు తెరదించాడు. బోర్డర్ – గవాస్కర్ సిరీస్ లో భారత తరఫున అత్యధిక పరుగులతో నాలుగు మ్యాచ్ ల్లో 297 పరుగులు చేసి జోరు అందుకున్న విరాట్ కోహ్లీ.. ఇటీవల ఐపీఎల్ లోనూ దూకుడు కొనసాగించాడు. చూడాలీ మరీ డబ్ల్యూటీసీ ఫైనల్ లో భారత్ ఏ విధంగా ప్రదర్శన కనబరుస్తుందో..