Australia: ఆస్ట్రేలియాలో ఒక భారతీయులు దారుణమైన జాతి వివక్షను ఎదుర్కొన్నారు. కొందరు దుండగులు అతడిని దుర్భాషలాడుతూ, తీవ్రంగా దాడి చేశారు. గత వారం దక్షిణ ఆస్ట్రేలియన్ నగరమైన అడిలైడ్‌లో ఓ కార్ పార్కింగ్ వివాదంలో, గుర్తు తెలియని వ్యక్తులు చరణ్‌ప్రీత్ సింగ్ అనే వ్యక్తిపై దాడి చేశారు. కింటోర్ అవెన్యూలో శనివారం రాత్రి 9.22 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది.
అమెరికాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. టెక్సాస్ వరదలతో వణుకుతోంది. ఆకస్మిక వరదల కారణంగా, గ్వాడాలుపే నది దాదాపు 45 నిమిషాల్లో 26 అడుగులు పెరిగి ఉదృతంగా ప్రవహిస్తోంది. వరద కారణంగా, తొమ్మిది మంది పిల్లలు సహా 43 మంది మరణించారు. అదే సమయంలో, వేసవి శిబిరం నుంచి 23 మంది బాలికలు సహా 27 మంది గల్లంతయ్యారు. తుఫాను సెంట్రల్ టెక్సాస్ మీదుగా కదులుతున్నందున మరిన్ని భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉందని నేషనల్ వెదర్…
Iran -Israel : ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా విజయవంతంగా వైమానిక దాడులు నిర్వహించిందని మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. “ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్” అనే కీలక అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయని శనివారం ఆయన “ట్రూత్ సోషల్” వేదికగా తెలిపారు. “ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై మేం చేసిన దాడి పూర్తి విజయవంతంగా ముగిసింది. మా బాంబర్లు ఫోర్డోపై పూర్తి స్థాయిలో…
Austria school shooting: యూరోపియన్ దేశం ఆస్ట్రియాలో ఓ ఉన్మాది నరమేధం సృష్టించాడు. గ్రాజ్లోని ఒక స్కూల్లో జరిపిన కాల్పుల్లో కనీసం 8 మంది మరణించగా, చాలా మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అనుమానితుడు విద్యార్థి అని తెలుస్తోంది. ఘటన తర్వాత నిందితుడు వాష్ రూంలో ఆత్మహత్య చేసుకుని కనిపించాడని ఆస్ట్రియన్ స్టేట్ మీడియా ఓఆర్ఎఫ్ని ఉటంకిస్తూ యూకేకి చెందిన ఇండిపెండెంట్ నివేదించింది. అయితే, అధికారుల నుంచి ఇంకా ధ్రువీకరణ రావాల్సి ఉంది. Read Also:…
US China Trade War: అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వారం చివరలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా ప్రెసిడెంట్ జి జిన్‌పింగ్ చర్చిస్తారని వైట్‌హౌజ్ సోమవారం తెలిపింది.
China: ఇంటి అద్దెను ఆదా చేసుకునే ఉద్దేశంతో ఓ మహిళ ఏకంగా కంపెనీ టాయిలెట్‌ని మకాంగా మార్చుకుంది. చైనాకు చెందిన 18 ఏళ్ల యువతి యాంగ్, తన పనిచేస్తున్న ఫర్నీచర్ దుకాణంలోని టాయిలెట్‌ని నివాసంగా చేసుకుంది. దీనికి నెలకు 5 యువాన్లు (రూ. 545) అద్దె చెల్లిస్తుంది. ఖర్చులను తగ్గించుకోవడానికి ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఆమె నెలకు దాదాపుగా రూ. 34,570 సంపాదిస్తుంది. ఆమె సంపాదనలో ఎక్కువ భాగాన్ని ఆదా చేయడానికి ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటుంది.
Canada : 2023 సంవత్సరంలో కెనడాలో జరిగిన పెద్ద బంగారు దొంగతనంలో కొత్త కోణం బయటపడింది. ఈ దొంగతనంలో కెనడియన్ పోలీసులు కూడా ఒక భారతీయుడిపై అనుమానాలు వ్యక్త పరిచారు.
PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్లో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమవుతారు.
Russia : రష్యా-ఉక్రెయిన్ ల మధ్య రెండేళ్లుగా యుద్ధం నడుస్తోంది. ఉక్రెయిన్ను నాశనం చేసి తీరుతామని రష్యా మొండిగా ఉంది. అయితే ఉక్రెయిన్ కూడా రష్యా ముందు లొంగిపోవడానికి సిద్ధంగా లేదు.
Gaza Ceasefire: గాజాలో రెండు రోజుల కాల్పుల విరమణను ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్-ఫత్తా అల్-సిసి ప్రతిపాదించారు. ఈ రెండు రోజులలో, కొంతమంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా నలుగురు ఇజ్రాయెలీ బందీలను మార్చుకునే ప్రతిపాదన చేయబడింది. ఈ విషయాన్ని అబ్దెల్-ఫత్తా అల్-సిసి ఆదివారం నాడు ప్రకటించారు. బందీలను విడుదల చేసిన తర్వాత మరో 10 రోజుల అదనపు చర్చలు కూడా ఈ ప్రతిపాదనలో ఉన్నాయని ఆయన తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇజ్రాయెల్ భద్రతా ఏజెన్సీ షిన్ బెట్…