Iran: దేశ వ్యాప్తంగా చెలరేగుతున్నఆందోళనల్ని ఇరాన్ అణచివేయాలని చూస్తోంది. అయతొల్లా అలీ ఖమేనీ మతపాలనకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. వందలాది మంది ఇప్పటికే మరణించారు. అయితే, ఈ నిరసనలతో సంబంధం ఉన్నవారిని అక్కడి ప్రభుత్వ కఠినంగా శిక్షించేందుకు సిద్ధమైంది. తాజాగా, మొదటి ఉరిశిక్షను అమలు చేయాడానికరి ఇరాన్ అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 26 ఏళ్ల ఎర్ఫాన్ సొల్తానీకి త్వరలో మరణశిక్ష అమలు చేయనున్నారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలు ఆగడం లేదు. మరో హిందూ యువకుడిని కొట్టి చంపారు. ఆటోడ్రైవర్ అయిన 28 ఏళ్ల సమీర్ కుమార్ దాస్‌ను పథకం ప్రకారం కొట్టి చంపినట్లు తేలుస్తోంది. ఈ ఘటన ఆదివారం రాత్రి చిట్టగాంగ్‌లోని దగన్‌భూయాన్‌లో జరిగింది.
Trump: ప్రజా ఉద్యమంతో ఇరాన్ అట్టుడుకుతోంది. సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మతపాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చారు. రాజధాని టెహ్రాన్‌తో పాటు అన్ని ప్రావిన్సుల్లో ప్రజాందోళన ఎగిసిపడుతోంది. ఇదిలా ఉంటే, ఈ ఉద్యమాన్ని బలవంతంగా అణిచివేసేందుకు ఖమేనీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
India Slams Mamdani: న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీపై భారత్ విమర్శలు గుప్పించింది. ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఉమర్ ఖలీద్‌కు మద్దతుగా మమ్దానీ లేఖ రాశారు. ఈ కేసులో ప్రస్తుతం, ఖలీద్ జైలులో ఉన్నాడు. ఇటీవల సుప్రీంకోర్టు అతడి బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. అయితే, మమ్దానీ లేఖపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. మమ్దానీ ఇతర ప్రజాస్వామ్య దేశాల న్యాయవ్యవస్థల పట్ల గౌరంగా ఉండాలని, తనకు అప్పగించిన…
Pakiatan: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను అమెరికా కిడ్నాప్ చేయాలని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ కోరారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను తీసుకెళ్లినట్లే నెతన్యాహూను కూడా కిడ్నాప్ చేయాలని అన్నారు. మానవత్వానికి వ్యతిరేకంగా చెత్త నేరస్తుడు అని నెతన్యాహూను పాక్ నిందించింది. టర్కీ కూడా నెతన్యాహూను కిడ్నాప్ చేయలగలదని, పాకిస్తానీయులు దాని కోసం ప్రార్థిస్తున్నారని అన్నారు. Read Also: Duddilla Sridhar Babu : నిరుద్యోగుల పట్ల ‘బీఆర్ఎస్’ది కపట ప్రేమే. గురువారం ఒక…
Greenland issue: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను డెన్మార్క్ దేశానికి చెందిన ద్వీపమైన ‘‘గ్రీన్‌ల్యాండ్’’పై పడింది. తమ జాతీయ భద్రత కోసం గ్రీన్‌ల్యాండ్ కావాల్సిందే అని ట్రంప్ చెబుతున్నారు. అవసరమైతే సైనిక చర్యకు కూడా దిగుతామని హెచ్చరిస్తున్నారు. అయితే, అమెరికా దుందుడుకు చర్యలపై యూరప్ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తు్న్నాయి. అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో డెన్మార్క్ సభ్యదేశంగా ఉంది. సభ్యదేశంగా ఉన్న డెన్మార్క్‌పై దాడి చేస్తే ఇది నాటో భవితవ్యాన్నే ప్రశ్నార్థకం చేస్తుందని యూరప్…
Iran Protests: వెనిజులా సైనిక చర్య నేపథ్యంలో, అమెరికా ఇరాన్‌లో ఏదైనా సైనిక చర్య చేపడుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే, ఇరాన్ వ్యాప్తంగా ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ద్రవ్యోల్భణం, నిరుద్యోగం, ప్రభుత్వంపై ఉద్యమాన్ని తీవ్రం చేస్తున్నారు. ఇప్పటికే, ఈ అల్లర్లలో 30 మందికి పైగా చనిపోయారు. మరోవైపు, బలవంతంగా ఇరాన్ ప్రభుత్వం, నిరసనకారులపై కాల్పులు జరిపితే చూస్తూ ఊరుకోబోమని అమెరికా ఇప్పటికే ప్రకటించింది.
Greenland: ఆర్కిటిక్ ద్వీపం, డెన్మార్క్ ఆధీనంలో ఉన్న ‘‘గ్రీన్‌ల్యాండ్’’పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను పడింది. దీనిని అమెరికాకు ఇచ్చేయాలంటూ ట్రంప్ డెన్మార్క్‌ను బెదిరిస్తున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో యూరప్ దేశాలు అన్ని ఒక్కటయ్యాయి. గ్రీన్‌ల్యాండ్ భవిష్యత్తును గ్రీన్‌ల్యాండ్, డెన్మార్క్ మాత్రమే నిర్ణయించుకోగలవని మంగళవారం యూరోపియన్ నాయకులు ప్రకటించారు.
Gustavo Petro: గత శనివారం వెనిజులాపై అమెరికా దాడులు చేసి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికాకు బందీలుగా పట్టుకెళ్లారు. వీరిద్దరిపై నార్కో టెర్రరిజం, అక్రమ ఆయుధాల కేసుల్ని మోపింది. మదురో డ్రగ్స్ ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని ట్రంప్ ప్రధాన ఆరోపణ. యూఎస్‌లోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడని యూఎస్ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే, వెనిజులాలో ఉండే చమురు, అదరుదైన ఖనిజాల కోసంమే ట్రంప్ ఈ కుట్రకు తెరదీశాడని మరికొందరు ఆరోపిస్తున్నారు.
Saudi Arabia: ఇస్లామిక్ దేశాల్లో ఉరిశిక్షలు సర్వసాధారణం. సౌదీ అరేబియాలాంటి దేశాల్లో వందలాది ఉరిశిక్షలు అమలవుతుంటాయి. 2025లో సౌదీ రికార్డు స్థాయిలో 356 మందికి ఉరిశిక్షల్ని అమలు చేసింది. ఒకే ఏడాదిలో మరణశిక్షలకు గురైన ఖైదీల విషయంలో సౌదీ రికార్డ్ సృష్టించింది. ఉరిశిక్షల పెరుగుదలకు ప్రధాన కారణం ‘‘మాదకద్రవ్యాలపై యుద్ధం’’ అని అక్కడి నిపుణులు పేర్కొంటున్నారు. మొదటిసారిగా అరెస్టయిని వారిలో కూడా చాలా మంది ఇప్పుడు ఉరిశిక్షలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం,…