India Slams Mamdani: ‘‘మీ పని చూసుకోండి’’.. న్యూయార్క్ మేయర్ మమ్దానీపై భారత్ విమర్శలు..
- మీ బాధ్యతలు చూసుకోండి..
- న్యూయార్క్ మేయర్‌పై భారత్ విమర్శలు..
- ఇటీవల ఢిల్లీ అల్లర్ల నిందితుడికి మద్దతుగా లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Slams Mamdani: న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీపై భారత్ విమర్శలు గుప్పించింది. ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఉమర్ ఖలీద్‌కు మద్దతుగా మమ్దానీ లేఖ రాశారు. ఈ కేసులో ప్రస్తుతం, ఖలీద్ జైలులో ఉన్నాడు. ఇటీవల సుప్రీంకోర్టు అతడి బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. అయితే, మమ్దానీ లేఖపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. మమ్దానీ ఇతర ప్రజాస్వామ్య దేశాల న్యాయవ్యవస్థల పట్ల గౌరంగా ఉండాలని, తనకు అప్పగించిన బాధ్యతలపై దృష్టి పెట్టాలని సూచించారు.
Read Also: Child P*rn : చైల్డ్ పో*ర్న్ రాకెట్టు గుట్టు రట్టు.. తెలంగాణలో 24 మంది అరెస్ట్
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
గత నెలలో ఉమర్ ఖలీద్ తల్లిదండ్రులను కలిసినప్పుడు మమ్దానీ అతడికి మద్దతుగా లేఖలో సంఘీభావాన్ని తెలియజేశారు. “ప్రియమైన ఉమర్, చేదు గురించి నీ మాటలను నేను తరచుగా గుర్తు చేసుకుంటాను, అది మనల్ని ఆవరించకుండా చూసుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి ఆలోచిస్తాను. మీ తల్లిదండ్రులను కలవడం ఆనందంగా ఉంది. మేమందరం నీ గురించి ఆలోచిస్తున్నాము” మమ్దానీ లేఖలో పేర్కొన్నారు.
ఢిల్లీ అల్లర్ల నిందితుడు ఖలీద్‌కు గతంలో కూడా మమ్దానీ మద్దతు ఇచ్చారు. న్యూ్యార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా ఉన్న సమయంలో, జూన్ 2023లో ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నాడు. ఖలీద్ అన్యాయంగా హింసించబడుతున్న స్కాలర్‌గా, మాజీ విద్యార్థి కార్యకర్తగా చెప్పారు. ఫిబ్రవరి 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఖలీద్ దాదాపు ఐదేళ్లుగా జైలులో ఉన్నారు. ఈ అల్లర్లలో 53 మంది మరణించారు. తన సోదరి వివాహానికి హాజరయ్యేందుకు అతనికి డిసెంబర్ 16 నుండి 29 వరకు తాత్కాలిక బెయిల్ మంజూరైంది.
తాజావార్తలు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?