Kejriwal: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో నేరాలు క్రమంగా పెరిగిపోతున్నాయని మాజీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
గురువు అంటే తండ్రిలా భావించి, విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలి. వారికి విద్యాభ్యాసం, సరైన మార్గదర్శనాలు అందించి సమాజంలో మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. కానీ కొంతమంది వ్యక్తులు గాడి తప్పి, వారి పాత్రను మరిచిపోతున్నారు.
Delhi : రాజధాని డిటిసి (ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్) బస్సుల భద్రత కోసం మోహరించిన బస్ మార్షల్స్‌ను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనాకు సిఫార్సు చేసింది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని, రాష్ట్రాలు మహిళల భద్రతకు భరోసా ఇవ్వాలని అన్నారు.
దేశంలోని మహిళల భద్రత కోసం వివిధ పథకాలు, కార్యక్రమాల కింద రూ.13,412 కోట్లు ఖర్చు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. మహిళా భద్రతా పథకాల కింద మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపుల కేసులను నిర్వహించే పరిశోధకులతోపాటు ప్రాసిక్యూటర్ల సామర్థ్యం పెంపొందించేందుకు శిక్షణ ఇచ్చే నిబంధన ఉందా? ఏయే కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటూ ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ బదులిచ్చారు. ప్రధానమంత్రి ఆదేశాల మేరకు హోం మంత్రి…
మహిళల భద్రత విషయంలో తన సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కొన్ని గంటల తర్వాత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం రాజేంద్ర గూడాను రాష్ట్ర మంత్రిగా తొలగించారు.
రాష్ట్రంలోని మహిళలందరూ దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు. ఎన్టీఆర్ జిల్లాలో దిశా యాప్ మెగా ఈవెంట్ నిర్వహించారు. ఒకే రోజు రెండు లక్షల మంది డౌన్ లోడ్ చేసుకునేలా జిల్లా వ్యాప్తంగా దిశా ఎస్.ఓ.ఎస్ యాప్ పై మాస్ క్యాంపెయిన్ జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి దిశా యాప్ మెగా ఈవెంట్ ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, పోలీస్ కమీషనర్…
రేపల్లె రైల్వే స్టేషన్ అత్యాచార ఘటన ఆంధ్రప్రదేశంలో ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలుసు! రాష్ట్రంలో మహిళా సంరక్షణపై ఆ ఘటన ఎన్నో ప్రశ్నల్ని రేకెత్తించింది! రైల్వే స్టేషన్‌లాంటి పబ్లిక్ ప్లాట్‌ఫామ్, అది కూడా భద్రత ఎక్కువగా ఉండే చోట్లలో ఒకటైన అలాంటి ప్రదేశంలో.. ఓ మహిళ అత్యాచారానికి గురవ్వడాన్ని బట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. Read Also: Botsa Satyanarayana: నారా లోకేష్ లేఖకు బొత్స స్ట్రాంగ్ రియాక్షన్ ఈ నేపథ్యంలోనే…
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడ..? మాటలు తప్ప చేతలు లేని చేతగాని ప్రభుత్వమిది.. వరుసగా మహిళలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నా సీబీఐ దత్తపుత్రుడిలో చలనం లేదు అంటూ ఫైర్ అయ్యారు మనోహర్.. పోలీసులను రాజకీయ అవసరాలకు వాడుకుంటూ శాంతి భద్రతలను గాలికొదిలేశారని ఆరోపించిన ఆయన.. దిశ చట్టం చేశాం.. గన్ కంటే జగన్ ముందు వస్తాడు.. లాంటి మాటలు…
ఏపీలో శాంతిభద్రతల పరిస్ధితులు, హోంశాఖ పనితీరుపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. ఏసీబీ, దిశ, ఎస్ఈబీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అవినీతి చోటుచేసుకుంటున్న విభాగాలను క్లీన్ చేయాల్సిందే అని స్పష్టం చేశారు. దిశ తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీకి యాప్ రూపొందించాలన్నారు. నెలరోజుల్లోగా యాప్ రూపకల్పన చేయాలన్నారు. ఆడియోనూ ఫిర్యాదుగా పంపొచ్చు. నేర నిర్ధారణకు ఫోరెన్సిక్ విభాగం బలోపేతం చేయాలన్నారు. మండల స్థాయి వరకూ ఏసీబీ…