Mumbai Train Incident: మహిళల కంపార్టుమెంట్‌లో నగ్నంగా ప్రయాణించిన యువకుడు.. (వీడియో)
- సోషల్ మీడియాలో వైరల్ వీడియో
- మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ షాకింగ్ ఘటన
- మహిళల కంపార్టుమెంట్‌లో నగ్నంగా ప్రయాణించిన యువకుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Train Incident: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ నుంచి కళ్యాణ్ వెళ్ళే లోకల్ రైలు ఘట్‌కోపర్ స్టేషన్ వద్ద ఆగిన సమయంలో ఓ యువకుడు ఒంటిపై నూలుపోగు లేకుండా రైలులో ఎక్కాడు. అదికూడా నేరుగా మహిళల కంపార్టుమెంట్‌లో ప్రవేశించాడు. దీనితో రైల్లో ప్రయాణిస్తున్న మహిళల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలయింది. మహిళలు అందరూ అతడిని రైల్లో నుంచి బయటకు వెళ్లాలని అరిచారు. అయినా కానీ, అతడు వారి మాటలను పట్టించుకోలేదు. ఈ సందర్భంలో రైలు ఆపమని మహిళలు గట్టిగా అరిచారు. మహిళల అరుపులను విన్న పక్క బోగీలో ఉన్న టీసీ అక్కడ చేరుకుని అతడిని కిందకు దిగమని హెచ్చరించాడు. అయితే, సదరు నగ్న వ్యక్తి నిరాకరించడంతో, టీసీ అతడిని బలవంతంగా తర్వాత స్టేషన్‌లో బలవంతంగా రైలు నుండి కిందకు తోశాడు.
Also Read: Rs.5 Biryani Offer: రూ.5 బిర్యానీకి భారీ బందోబస్తు..! పోలీసుల తీరుపై విమర్శలు..
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
- CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
- AP Weather Update: ఈదురు గాలులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో కీలక హెచ్చరికలు జారీ..
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ ఘటనపై వివిధ రకాలుగా స్పందించారు. కొందరు నిందితుడి అసభ్యమైన తీరును ఘాటుగా వ్యతిరేకిస్తున్నారు. మరికొంత మంది సోషల్ మీడియా వినియోగదారులు రైళ్లలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే నిందితుడి మానసిక స్థితి సరిగ్గా లేదేమోనని పలు అనుమానలు వ్యక్తం చేశారు. అయితే, సదరు వ్యక్తిని పోలీసులు విచారించినప్పుడు, అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని విచారణలో తేలింది. దాంతో, అతడికి బట్టలు అందించి, అతడిని స్టేషన్ బయటికి పంపించారు.
Mumbai Local Viral Video, naked man in mumbai local train pic.twitter.com/kjTGnnCkyd
— Chinmay jagtap (@Chinmayjagtap18) December 17, 2024
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
-
CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!