Gang Rape: హైదర్షాకోట్ గ్యాంగ్ రేప్లో సంచలన విషయాలు..
- హైదర్షాకోట్ గ్యాంగ్ రేప్లో సంచలన విషయాలు
- మైనర్ బాలిక పై రెండు సార్లు గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డ యువకులు
- పార్క్ లో ఆడుకుంటున్న బాలిక ను కిడ్నాప్ చేసి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి అత్యాచారం చేసిన నలుగురు యువకులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదర్షాకోట్ గ్యాంగ్ రేప్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి.. మైనర్ బాలికపై రెండు సార్లు యువకులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. పార్క్‌లో ఆడుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి అత్యాచారం చేశారు నిందితులు మధుసూదన్, జయంత్, తరుణ్ కుమార్.. అనంతరం.. బాలిక చెవి కమ్మలు లాక్కున్నారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి బాలికి ఇంటికి సమీపంలో వదిలి వెళ్లిపోయారు యువకులు. అనంతరం.. నిందితులు బాలికను డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశారు. ఈ క్రమంలో తండ్రి బ్యాగ్‌లో నుంచి 10 వేల రూపాయలు దొంగిలించి యువకులకు ఇచ్చింది బాలిక. కాగా.. బాలికను అత్యాచారం చేసిన విషయాన్ని మధుసూదన్ అనే యువకుడు మరో ఫ్రెండ్ సాయి కుమార్‌కి చెప్పాడు. దీంతో.. ఇంటికి సమీపంలో ఉండే సాయికుమార్ బాలికను కలిసి తనకు విషయం అంతా తెలుసని బెదిరింపులకు పాల్పడ్డాడు.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
బాలికను తన రూంకి తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు యువకుడు సాయి కుమార్. అంతేకాకుండా.. న్యూడ్ వీడియోలు, అత్యాచారం వీడియో రికార్డు చేశాడు. తాను కూడా అత్యాచారం చేసానని స్నేహితులు మధు, జయంత్, తరుణ్‌కి చెప్పాడు. ఆ తర్వాత.. నలుగురూ కలిసి బాలికను మరోసారి బ్లాక్ మెయిల్ చేశారు. ఇంట్లో ఉన్న నగలు దొంగిలించి తీసుకురమ్మని బెదిరించారు. ఈ క్రమంలో తల్లి చైన్ దొంగిలించి యువకులకు ఇచ్చేందుకు బాలిక వెళ్తుండగా.. తల్లికి అనుమానం వచ్చి నిలదీసింది. దీంతో.. బాలిక తల్లికి అసలు విషయం చెప్పింది. ఈ క్రమంలో బాలిక పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. యువకులు మధుసూదన్, జయంత్, తరుణ్, సాయిలను నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కిడ్నాప్, అత్యాచారం, దోపిడీ, పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.
Read Also: BRS: బీసీల రిజర్వేషన్ల అంశంపై సీఎస్‌కు బీఆర్ఎస్ వినతిపత్రం..
తాజావార్తలు
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
-
School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
-
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
-
BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!