CMR Engneering College : మేడ్చల్ సమీపంలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో (CMR Engineering College) గర్ల్స్ హాస్టల్‌లో జరిగిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హాస్టల్ బాత్‌రూముల్లో కెమెరాలు అమర్చినట్లు విద్యార్థినిలు గుర్తించి, రహస్యంగా వీడియోలు తీస్తున్నారన్న ఆరోపణలతో ఆందోళనకు దిగారు. ఈ దారుణ ఘటనపై విద్యార్థినిలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
వీడియోలు తీసిన వారు హాస్టల్‌లో పనిచేస్తున్న వంట సిబ్బంది కావచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధ్యులను తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని విద్యార్థినిలు డిమాండ్ చేస్తున్నారు. తమ గోప్యతకు భంగం కలిగించిన ఈ దారుణ ఘటనపై కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు నినాదాలు చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే కాలేజీకి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థినులతో మాట్లాడి, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థినుల ఆందోళనను తగ్గించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.
అనుమానితులపై పోలీసులు కేసు నమోదు చేసి, కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హాస్టల్‌లో విద్యార్థినుల భద్రతకు సంబంధించి ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. కళాశాల యాజమాన్యం భద్రతా వ్యవస్థను సమీక్షించి, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థినిలు కోరుతున్నారు.
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ సమావేశం.. వీటికి ఆమోదం తెలపనున్న ప్రభుత్వం..