ట్రోల్ రాయుళ్ళకు మహిళా కమిషన్ సిరియస్ వార్నింగ్ ఇచ్చింది.. చేతి లో ఫోన్ ఉందని ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టితే కఠిన చర్యలు ఉంటాయని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారద చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడారు.
Gang Rape : ఇటీవల అత్యాచార ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతుండటం అత్యంత ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఏ వయస్సు వారినైనా లక్ష్యంగా చేసుకుని దుర్మార్గులు తమ కీచక కోరికలు తీర్చుకుంటున్నారు. పాఠశాలలు, కార్యాలయాలు, కూడా మహిళలకు సురక్షిత ప్రదేశాలుగా మారలేని పరిస్థితి ఏర్పడింది. బాలికలు కూడా ఈ దారుణాలకు గురవుతుండటం గమనార్హం. ఇటీవల అనేక స్కూల్ విద్యార్థినులు వారి బంధువుల చేతుల్లోనే అత్యాచారానికి గురవుతున్న దారుణ సంఘటనలు…
Matrimonial Sites: గుజరాత్‌కి చెందిన 26 ఏళ్ల యువకుడిని వసాయి ఈస్ట్‌లోని వాలివ్ పోలీస్ బుధవారం అరెస్ట్ చేసారు. అతను మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా పరిచయం అయిన 15కి పైగా మహిళలను గత రెండున్నర సంవత్సరాలుగా పెళ్లి పేరుతో మోసం చేసి లైంగికంగా, ఆర్థికంగా దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అహ్మదాబాద్‌కు చెందిన హిమాంషు యోగేశ్‌భాయ్ పంచాల్ అనే వ్యక్తి మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో తనను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సైబర్ సెక్యూరిటీ డివిజన్లో…
CMR Engneering College : మేడ్చల్ సమీపంలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో (CMR Engineering College) గర్ల్స్ హాస్టల్లో జరిగిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హాస్టల్ బాత్రూముల్లో కెమెరాలు అమర్చినట్లు విద్యార్థినిలు గుర్తించి, రహస్యంగా వీడియోలు తీస్తున్నారన్న ఆరోపణలతో ఆందోళనకు దిగారు. ఈ దారుణ ఘటనపై విద్యార్థినిలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వీడియోలు తీసిన వారు హాస్టల్లో పనిచేస్తున్న వంట సిబ్బంది కావచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధ్యులను తక్షణమే పట్టుకుని…
Harish Rao : రాష్ట్రంలో మహిళలు, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని, ప్రభుత్వ వైఫల్యానికి ఇదే నిదర్శనమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గత సంవత్సరంతో పోలిస్తే తెలంగాణలో నేరాల రేటు 22.5% పెరిగిందన్నారు. అత్యాచార కేసులు 28.94% పెరిగాయని, ఏడాదిలో మొత్తం 2,945 కేసులు నమోదయ్యాయన్నారు. సగటున రోజుకు 8 కేసులు నమోదవుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఇందులో 82 మైనర్ బాలికలపై అఘాయిత్యాలు జరగడం సిగ్గుచేటని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్…
Mumbai Train Incident: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ నుంచి కళ్యాణ్ వెళ్ళే లోకల్ రైలు ఘట్కోపర్ స్టేషన్ వద్ద ఆగిన సమయంలో ఓ యువకుడు ఒంటిపై నూలుపోగు లేకుండా రైలులో ఎక్కాడు. అదికూడా నేరుగా మహిళల కంపార్టుమెంట్లో ప్రవేశించాడు. దీనితో రైల్లో ప్రయాణిస్తున్న మహిళల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలయింది. మహిళలు అందరూ అతడిని రైల్లో నుంచి బయటకు వెళ్లాలని అరిచారు. అయినా కానీ, అతడు వారి…
Kejriwal: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో నేరాలు క్రమంగా పెరిగిపోతున్నాయని మాజీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
గురువు అంటే తండ్రిలా భావించి, విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలి. వారికి విద్యాభ్యాసం, సరైన మార్గదర్శనాలు అందించి సమాజంలో మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. కానీ కొంతమంది వ్యక్తులు గాడి తప్పి, వారి పాత్రను మరిచిపోతున్నారు.
Delhi : రాజధాని డిటిసి (ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్) బస్సుల భద్రత కోసం మోహరించిన బస్ మార్షల్స్‌ను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనాకు సిఫార్సు చేసింది.