ట్రోల్ రాయుళ్ళకు మహిళా కమిషన్ సిరియస్ వార్నింగ్ ఇచ్చింది.. చేతి లో ఫోన్ ఉందని ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టితే కఠిన చర్యలు ఉంటాయని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడారు. “మహిళను వెన్నంటూ ప్రోత్సాహించాలి.. తప్పా..తప్పు గా వ్యవహరించవద్దు.. మీ ఇంట్లో ఆడవారిలానే.. బయట మహిళను గౌరవించండి.. సోషల్ మీడియాలో మహిళపై అసభ్యకర పోస్ట్ లపై ఫోకస్ పెట్టాము.. నేను ఛార్జ్ తీసుకున్న వారనికే కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాము.. కానీ వాటిని పాటించడం లేదు.. మహిళలపై ట్రోలింగ్ చేస్తున్న సోషల్ మీడియా వారిపై చర్యలు తీసుకుంటాము.. మహిళ రక్షణ కోసం రానున్న రోజుల్లో పటిష్టమైన చట్టాలు రాబోతున్నాయి.. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లు.. శృతి మించితే చర్యలు తప్పవు.. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయట పడాలి..” అని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వ్యాఖ్యానించారు.
READ MORE: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
ర్యాంకుల వేటలో ప్రాణాలు తీసుకోవద్దని.. కుటుంబ సభ్యులు సహకరిస్తేనే మహిళలు మరింత గా రాణిస్తారని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద చెప్పారు. “మహిళ కమిషన్ తరపున మహిళలను ఎలా గౌరవించాలి అనే దానిపై అవగాహన కార్యక్రమాలు చేపడతాము.. హాస్టళ్లలో యువతుల ఆత్మహత్యలు, వసతులు, స్పై కెమెరాలు, ఇతర అంశాలపై దృష్టి పెట్టాము.. మహిళ కమిషన్ మాత్రమే కాదు అందరూ హాస్టళ్ల వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండాలి.. మహిళలకు ఎలాంటి సమస్య ఉన్న ఏ సమయంలో నైనా కమిషన్ కు కాల్ చేస్తే స్పందిస్తాము.. ఈ ఏడు నెలల కాలంలో లివింగ్ రిలేషన్ సంబంధించిన కేసులు ఎక్కువగా కమిషన్ దృష్టికి వస్తున్నాయి.. డొమెస్టిక్ వయిలెన్స్ కేసులు ఎక్కువ వస్తున్నాయి..” అని ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద తెలిపారు.